37.2 C
Hyderabad
April 26, 2024 21: 56 PM
Slider నల్గొండ

LRS కట్ట వద్దని TPCC జాయింట్ సెక్రెటరీ అజీజ్ పాషా పిలుపు

#AzeezPasha

శాసనసభ ,శాసన మండలిలో ఈ నెల13,14 తేదీల్లో టి.ఆర్.ఎస్ ప్రభుత్వం LRS ను రద్దు చేస్తున్నట్లు ప్రకటన  చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతులకు వ్యతిరేక చట్టాలను కూడా రద్దు  చేస్తున్నట్టు అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాలలో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం  చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా చేయాలని టీ.పీ.సీ.సీ జాయింట్ సెక్రెటరీ ఎండీ. అజీజ్ పాషా కోరారు.

 సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం పత్రికల వారితో అజీజ్ పాషా మాట్లాడుతూ టి.ఆర్.ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును  దోచుకోవడం  కోసం క్రమబద్ధీకరణ పేరుతో ప్రజలను పీడిస్తూ వేల,లక్ష రూపాయలు దండుకొని ఖజానా నింపుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నమే ఎల్.ఆర్.ఎస్ (LRS)అని అన్నారు.30, 40 సంవత్సరాల క్రితం కొన్న భూములు ఆస్తులకు క్రమబద్ధీకరణకు వేల రూపాయలు ఫీజులు కట్టాలంటే కట్టలేక రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు.

ప్రజలపై భారం మోపుతున్న  LRS ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజలకు అండగా వుండి  మద్దతు తెలుపుతుందని, ఇప్పటికే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నల్గొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ N. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ   LRS ను  ప్రజలు ఎవరు కట్టవద్దని,వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని,ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రజల ఆస్తులన్నింటినీ ఉచితంగా క్రమబద్ధీకరణ చేయటం జరుగుతుందని ప్రజలకు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా  సమయంలో ప్రజలందరూ ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ప్రజలపై ఆర్థిక భారం LRS ద్వారా మోపుతూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కె.సి.ఆర్  LRS ను రద్దు చేస్తున్నట్టు  ప్రకటన జారీ చేయాలని,  ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

దుబ్బాక లో జరగబోయే ఉప ఎన్నికల్లో టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ,  చేయకుండా మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని ఈ ఎన్నిక ద్వారా  గుణపాఠం చెప్పాలని ఎండీ. అజీజ్ పాషా అన్నారు.

Related posts

బాధిత కుటుంబానికి సాయం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

వందల కోట్ల మనీలాండరింగ్ తో దేశ భద్రతకు ముప్పు

Satyam NEWS

కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో వాలంటీర్ మృతి

Satyam NEWS

Leave a Comment