26.7 C
Hyderabad
April 27, 2024 07: 23 AM
Slider ప్రత్యేకం

స్పందనకు తగ్గని ఫిర్యాదులు..18 మంది బాధితులు సమస్యలతో ఎస్పీకి మొర..!

#vijayanagarampolice

ప్రతీ సోమవారం లానే ఈ వారం కూడా విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ దీపిక  నిర్వహించారు. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

“స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 18 ఫిర్యాదు లను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. విజయనగరం, గాజులరేగ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ ఒక వ్యక్తి వద్ద తన భార్య పేరున ఒక ఇంటిని కొనే నిమిత్తం కొంత డబ్బులు అడ్వాన్సుగా ఆరేళ్ళ క్రితం ఇచ్చినట్లు, తనకు ఇల్లు గాని తన చెల్లించిన డబ్బులుగాని తిరిగి ఇవ్వడం లేదని, తన డబ్బులు తిరిగి ఇప్పించి తనకు న్యాయం చేయాలని కోరారు.

జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్టపరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం టూటౌన్ సీఐని అదేశించారు. నెల్లిమర్లకి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తన ఇంటిని జెసిబితో కూల్చివేశారని, వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు.

పాలసీ చేయిస్తానని మోసం చేయడంపై ఫిర్యాదు

ఈ ఫిర్యాది పై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి ఫిర్యాదికి న్యాయం చేయాలని నెల్లిమర్ల ఎస్ఐ ని ఆదేశించారు. కొత్తవలస మండలం, మంగళపాలెంకి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ విశాఖ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి, ఫిర్యాది భార్య పేరున ఇన్సూరెన్సు పాలసీ చేయిస్తానని చెప్పి కొంత డ్బులు తీసుకొని, పాలసీ చేయకుండా తనని మోసం చేసారని, తన డబ్బులు తనకి ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని కొత్తవలస సీఐని ఆదేశించారు.

బొబ్బిలికి చెందిన ఒఓ బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగిందని, తన భర్త, అత్తలు తనను అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, తన భర్త తన పిల్లల బాగోగులు చూడడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరారు.

విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొబ్బిలి సీఐని ఆదేశించారు. విజయనగరంకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ గంట్యాడ మండలంకు చెందిన ఒకామె తన షాపుని అద్దెకు తీసుకొని 11 నెలల నుండి అద్దె చెల్లించడం లేదని, షాపును ఖాళీ చేయమంటే చేయడం లేదని తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు.

స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం వన్ టౌన్ సీఐని ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదుల పై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుల పై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, డిసిఆర్ బి సిఐ బి.వెంకటరావు, ఎస్బీ సిఐ రుద్రశేఖర్, డీసీఆర్ బి ఎస్ఐ మురళి ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఆదిలాబాద్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

Satyam NEWS

ఆల్విన్ కాలనీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వలసలు

Satyam NEWS

జగన్ రెడ్డి ఇక కాస్కో పులి పంజా వాడి చూపిస్తాం

Satyam NEWS

Leave a Comment