38.2 C
Hyderabad
May 2, 2024 21: 17 PM
Slider నిజామాబాద్

అటవీ భూముల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం

#PocharamSrinivasareddy

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన సేవాలాల్ మహారాజ్ 282వ అధికారిక జయంతి వేడుకలలో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఉత్సవాల్లో ప్రధానమైన భోగ్ బండార్ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం మాట్లాడుతూ గిరిజన సోదరులందరరికి సేవాలాల్ మహారాజ్ జయంతి  శుభాకాంక్షలు తెలిపారు.

సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలు అన్ని వర్గాలకు ఆదర్శం అని ఆయన అన్నారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సేవాలాల్ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని సభా పతి వివరించారు.

లంబాడీల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. గిరిజనులు, అటవీశాఖ మధ్య ఉన్నఅటవీ భూముల సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా సభాపతి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ MP బీబీ పాటిల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి, తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, నటుడు చమ్మక్ చంద్ర, ప్రభుత్వ అధికారులు, బంజారా సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతులను వ్యాపారులుగా మార్చడానికే వ్యవసాయ చట్టాలు

Satyam NEWS

పోలీసులు క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్: ప్రకాశం జిల్లా ఎస్పీ

Satyam NEWS

ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ కు షోకాజ్ నోటీసు

Satyam NEWS

Leave a Comment