38.2 C
Hyderabad
April 29, 2024 20: 56 PM
Slider కృష్ణ

VOA నాగలక్ష్మి ఆత్మహత్య కేసులో వైసీపీ నేత అరెస్ట్

#suicide

కృష్ణా జిల్లా బందరు తాలూకా బొగిరెడ్డిపల్లి గ్రామస్థురాలు, VOA గరికిపాటి నాగలక్ష్మి ఆత్మహత్య కేసులో నిందితుడైన వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. VOA గరికిపాటి నాగలక్ష్మి గ్రామ సమైక్య సంఘంలో బుక్ కీపర్ గా కూడా పని చేస్తున్నారు. ఆమె అధీనంలో సుమారు 37 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. సదరు సంఘాల పొదుపు వివరాలు, లోన్ మంజూరు వివరాలు పుస్తకం ఆమె నమోదు చేసేవారు.

అందులోనే ఉన్న శ్రీ భ్రమరాంబిక స్వయం సహాయక సంఘం లో ఆమె సభ్యురాలు కూడా. మరో సభ్యురాలికి రుణం ఇప్పించే విషయంలో వివాదం కొనసాగుతున్నది. దానిపై సంబంధిత అధికారులైన APM, CC లు విచారణ జరిపారు. తన భార్యకు లోన్ మంజూరు చేయించనందుకు గరికపాటి నరసింహారావు నాగలక్ష్మిపై దౌర్జన్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఫిబ్రవరి 23న వెలుగు ఆఫీసులు సమావేశం జరుగుతుండగానే ఆమెను దుర్భాషలాడి దౌర్జాన్యానికి పాల్పడ్డట్టు ఫిర్యాదు కూడా ఉంది. 24 వ తేదిన నాగలక్ష్మి బందరు తాలూకా పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేయగా తాలూకా SI వారిద్దరిని పిలిచి కౌన్సిలింగ్ చేశారు.

గరికిపాటి నరసింహరావు ఇక తాను నాగమణి జోలికి వెళ్లనని హామీ పత్రం కూడా రాసిచ్చాడు. అయినా ప్రవర్తన మారకపోవడంతో గరికిపాటి నాగలక్ష్మి మార్చి14 వ తేదీన కృష్ణ జిల్లా SP స్పందన కార్యక్రమానికి వెళ్ళి ఫిర్యాదు చేసింది. SP సదరు ఫిర్యాదును బందరు రూరల్ CI కి పంపారు.

ఆమెకు న్యాయం చేస్తానని CI హామీ ఇచ్చారు. CI ఆదేశాల మేరకు బందరు రూరల్ స్టేషన్ SI నాగలక్ష్మి ఫిర్యాదు పై Cr.No-105/2022 U/s 354 354 –A 506, 509 r/w 34 IPC  కేసుగా నమోదు చేశారు. అయితే నాగలక్ష్మికి మళ్లీ అవమానాలు తప్పలేదు. దాంతో ఆమె మనస్తాపం చెంది పురుగుల మందు త్రాగి ఆత్మ హత్య కు ప్రయత్నం చేసింది.

ఆమె కుమారుడు ఆమెను చికిత్స కోసం చిన్నాపురం హాస్పిటల్ తీసుకువెళ్లి అక్కడ నుండి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళగా అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 17న ఉదయం 04.45  నిమిషాల సమయంలో చనిపోయింది. మృతురాలి కుమారుడు గరికిపాటి పార్ధ శివ సాయి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి ముద్దాయి గరికిపాటి నరసింహరావుని తేదీన అరెస్టు చేశారమని సీఐ కె.సుధీర్ కుమార్ తెలిపారు.

Related posts

ములుగులో బిఆర్ఎస్, బిజెపి లకు బిగ్ షాక్

Satyam NEWS

గ్రేట్: స్ప్రే యంత్రం రూపొందించిన నాగర్ కర్నూల్ ఎస్ పి

Satyam NEWS

ఆ రెండు రోజులు శ్రీవారి ఆలయం మూసివేత

Satyam NEWS

Leave a Comment