26.2 C
Hyderabad
December 11, 2024 19: 04 PM
Slider ఆధ్యాత్మికం

ఎన్నారై కె.కె.రెడ్డి ఆధ్యాత్మిక కార్యక్రమాలు

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పెద్ద కారంపల్లె హరిజన వాడ లో మన్నూరు రామ లక్షుమ్మ, నారాయణ రెడ్డి ట్రస్ట్ తరుపున ఎన్నారై కె.కె.రెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల ఆలయ నిర్మాణం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు, సీతారాముల కల్యాణం వేడుకగా నిర్వహించారు.

ఈసందర్భంగా వేదపండితులు పూజలు నిర్వహిం చారు.కోలాహలంగా కోలాటాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు.పరిసర ప్రాంతాల్లో లోని హరిజన వాడల్లో నూతన ఆలయాలకు భూమి పూజలు చేశారు. సీతారాముల కల్యాణం నిర్వహించి పెద్ద ఎత్తున అన్నదానం చేశారు.మన్నూరు రామ లక్షుమ్మ, నారాయణ రెడ్డి ట్రస్ట్ తరుపున గతంలో సేవా ధార్మిక కార్యక్రమాలు అనేకం చేపట్టామని అందులో భాగంగా కారంపల్లె దళిత వాడాలో సీతారాముల ఆలయ నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందని ఎన్నారై కె.కె.రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి,జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమరనాధ రెడ్డి,వైసీపీ నేతలు గాలివీటి మదన్ మోహన్ రెడ్డి,మన్నూరు సుబ్బారెడ్డి, సుభోద్ రెడ్డి, గీతాంజలి, శోభా, ఎం.పి.టి.సి. వరద రాజులు, కమలాపురం శివరామిరెడ్డి,జి.వెంకట సుబ్బయ్య, యన్.ఓబులు, కె.నరసింహులు తదితరు లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో మారు మ్రోగించారు.

Related posts

ముగ్గురికి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి

Bhavani

ఈనెల 18 నుంచి గిరిజన జాతీయ మహాసభలు

Bhavani

రూల్సు పాటించని ఐఏఎస్, ఐపిఎస్ అధికారులపై కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment