30.7 C
Hyderabad
April 29, 2024 04: 52 AM
Slider ఖమ్మం

402 గ్రామపంచాయతీలలో క్రీడా ప్రాంగణాలు

#bhadradri

జిల్లాలో 481 గ్రామపంచాయతీలలో తెలంగాణకు క్రీడా ప్రాంగణ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 402 గ్రామపంచాయతీలో క్రీడా ప్రాంగణాలు  ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్  తెలిపారు.  హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా,  డైరెక్టర్ హనుమంతరావు తెలంగాణకు క్రీడా ప్రాంగణాలు,  నర్సరీలు ఏర్పాటు,  బృహప్రకృతి వనాలు, ఇంటి పన్నులు వసూళ్లు,   వైకుంఠధామాలు నిర్వహణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 79 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాల్సిందని రానున్న పది రోజుల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు.  బృహత్ ప్రకృతి వనాల గురించి మాట్లాడుతూ జిల్లాలో 110 ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటివరకు 92 ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నిర్మాణంతో పాటు నిర్వహణకు  అత్యంత ప్రాధాన్య ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.  ఇంటి పనులు 82 శాతం జరిగాయని ఈనెలాఖరు  వరకు మిగిలిన 10 శాతం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. వైకుంఠ దామాల్లో విద్యుత్, నీటి సౌకర్యం కల్పనకు నివేదికలు అందచేయాలని డీపీఓ కు సూచించారు.  ఈ సమావేశంలో డిఆర్డిఓ మధుసూదన్ రాజు,  జడ్పీ సీఈఓ విద్యాలత,  డిపిఓ రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

“మాతృదేవోభవ”  చిత్రం నాకు గర్వకారణం

Satyam NEWS

పేపర్ ట్రబుల్: ఆదాయం లేక అగాధంలోకి

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

Satyam NEWS

Leave a Comment