31.2 C
Hyderabad
May 3, 2024 01: 27 AM
Slider కర్నూలు

బెళగావ్ నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర సంకల్పించిన శ్రీశైల జగద్గురు స్వామి

లోకం బాగుండాలని సంకల్పిస్తూ 650 కిలోమీటర్ల మహాపాదయాత్రకు జగద్గురు పీఠాధిపతి స్వామి వారు శ్రీకారం చుట్టారు. కర్ణాటక రాష్ట్రంలోని బెలగాం జిల్లా యడ్యూరు క్షేత్రం నుంచి శ్రీశైలం క్షేత్రం వరకు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి స్వామివారు లోకం బాగుండాలని సంకల్పిస్తూ శ్రీకారం చుట్టిన మహా పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. ఈరోజు ఈ కార్యక్రమంలో కాశీ జగద్గురువు శ్రీశ్రీశ్రీ 1008 డాక్టర్ మల్లికార్జున విశ్వరాద్య శివ చార్య స్వామి, విరక్త నీడసోషి మఠం స్వామి గారు,సెంట్రల్ మినిస్టర్ ప్రహల్లాద్ జోషి , కర్ణాటక దేవాదాయ శాఖ మంత్రి శశికళ, ముదనహళ్లి MLA…A.S పాటిల్ (నాడహలీ) , 50 మంది కర్ణాటక మఠాలకు సంబంధించిన శివచార్యులు ఎంతోమంది సమాజ పెద్దలు ఎడ్యూరు వీరభద్ర స్వామి దేవస్థానం అధికారులు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక సంబంధించిన శ్రీశైల జగద్గురు పీఠం భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాదయాత్ర సంకల్పాలు……

  1. దేశంలో ఉన్న యువత చెడు వ్యసనాలకు దూరం కావాలని సంకల్పం..
  2. దేశంలో ఉన్న రైతు గోమాత సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు పండించాలని సంకల్పం..
  3. దేశంలోని వృక్ష సంపదను కాపాడుకోవాలని సంకల్పం..
  4. ప్రపంచంలోని ఏ రెండు దేశాలు యుద్ధ వాతావరణానికి లోను కాకూడదని సంకల్పం…
  5. కరోనా లాంటి పీడత రోగాలు మానవాళి నుంచి దూరం అవ్వాలని సంకల్పం..
    6.ప్రపంచానికి శ్రీశైల క్షేత్ర/ శివ దీక్ష / వీర శైవ ధర్మం యొక్క మహాత్యాలన్నీ తెలియజేయాలని సంకల్పం..

Related posts

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన అక్కినేని సమంత

Satyam NEWS

వివేకా హత్య కేసులో సీబీఐ పై ఫిర్యాదు చేసిన గంగాధర్ రెడ్డి

Satyam NEWS

విజయ బేరి సభకు భారీగా తరలాలి

Bhavani

Leave a Comment