40.2 C
Hyderabad
April 29, 2024 15: 16 PM
Slider సినిమా

గుంటూరు లో “స్టార్ మా స్టార్స్” సందడి !!

#starmaa

“మా  ఇంటికి రండి” అని ఎంతో ప్రేమగా ఆహ్వానించిన గుంటూరు అభిమానుల ఇళ్లకు స్టార్ మా స్టార్స్ వెళ్లి అందరికీ నమ్మలేని అనుభూతిని కలిగించారు. బుల్లి తెర మీద మాత్రమే కనిపించే తారలు ఇంటికి వచ్చి కళ్ళ ముందు కనిపించేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేవు. స్టార్స్ ని వారు ఆడపడుచుల్లా ఇంట్లోకి ఆహ్వానించడం విశేషం. స్టార్ మా లో  ఈ నెల 11 న (సోమవారం)  సాయంత్రం 6. 30 గంటలకు ప్రారంభం కాబోతున్న “మామగారు” సీరియల్ నుంచి సుహాసిని, దేవిశ్రీ  – గుంటూరులో శ్రావణ శుక్రవారం పూజల్లో జరుగుతున్న సందడిని  మరింత ఉల్లాసభరితంగా మార్చేశారు. సీరియల్ కి సంబంధించిన ఎన్నో విశేషాలను అభిమానులు అడిగి తెలుసుకున్నారు.

సెప్టెంబర్ 3 న గ్రాండ్ లాంచ్ కాబోతున్న బిగ్ బాస్ గురించి కూడా చాలా ఉత్సాహంగా ఎదురుచూతున్నామని, అంతా ఉల్టా పల్టా గా ఉంటుందని నాగార్జున గారు చెబుతుంటే ఇంకా అంచనాలు పెంచేసుకున్నామని  అభిమానులు తమ మనసులో మాటని స్టార్ మా స్టార్స్ తో పంచుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 అందరికీ నచ్చుతుందని, స్టార్ మా పైన, మా సీరియల్స్ అన్నింటిపైనా మీరు చూపిస్తున్న అభిమానం ఇలాగే ఎప్పటికీ వుండాలని, మీరు సీరియల్ చూసి ఆశీర్వదిస్తే ఇంకా మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తామని చెప్పి స్టార్ మా స్టార్స్ ఆ అభిమానుల దగ్గర సెలవు తీసుకున్నారు. మొత్తం మీద స్టార్ మా బుల్లి తెర తారలు గుంటూరులో ఒక సంచలనం సృష్టించారు.   

Related posts

అమ్మ పై అత్యాచారం…. సమాజం సిగ్గుపడాలి

Satyam NEWS

పోలీసుల ఉక్కుపాదం:కేశినేని నాని గృహనిర్బంధం

Satyam NEWS

డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్ కోసం గంట‌న్న‌ర సేపు మీడియా ప‌డిగాపులు…!

Satyam NEWS

Leave a Comment