29.7 C
Hyderabad
April 29, 2024 10: 55 AM
Slider సినిమా

బార్క్‌ రేటింగ్స్‌లో దూసుకుపోయిన స్టార్‌ మా !

#starmaa

 ‘స్టార్‌ మా’ చానల్స్ కొత్త చరిత్ర సృష్టించాయి. ఇవి ‘మా’ ఛానల్స్ అంటూ అన్ని వర్గాల తెలుగు ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా అక్కున చేర్చుకున్న గ్రూప్ చానెల్స్ లో ప్రధానంగా ‘స్టార్‌ మా’ ఇప్పుడు దేశ వ్యాప్తంగా  రేటింట్స్‌ పరంగా తమ సత్తాను చాటింది. బార్క్‌ 2023వ సంవత్సరానికి 13వ వారం విడుదల చేసిన రేటింగ్స్‌లో ప్రైమ్‌ టైమ్‌ తోపాటు నాన్‌ ప్రైమ్‌ ట్రైమ్‌లో కూడా  ఇతర జీఈసీ ఛానెల్స్‌ రేటింగ్స్ ని దాటుకుంటూ, అత్యధిక  రేటింగ్స్‌ సాధించింది స్టార్‌ మా.

గత వారం రేటింగ్స్‌లో స్టార్‌ మా, తమకు పోటీగా చెప్పుకుంటున్న ఛానల్స్‌పై స్పష్టమైన ఆధిపత్యాన్నిచూపింది. స్టార్‌ మా మొత్తంమ్మీద 882 జీఆర్‌పీ ల రేటింగ్‌ను  సాధించగా, పోటీ ఛానెల్‌ కేవలం 772 జీఆర్‌పీ లకు మాత్రమే పరిమితం కావాల్సివచ్చింది. స్టార్‌ మా ప్రైమ్‌టైమ్‌ జీఆర్‌పీ లలో 342 , నాన్‌ ప్రైమ్‌ టైమ్‌లో 510  సాధించింది. ఇక ఆదివారాలలో సైతం మరే ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌కూ అందనంత దూరంలో 132 జీఆర్‌పీ లను స్టార్‌ మా సాధించగా, స్టార్‌మాతో పోటీపడిన ఛానెల్‌ కేవలం 81 జీఆర్‌పీ లు  మాత్రమే సాధించడం గమనార్హం.

నూతన సీరియళ్ల లాంచ్ ల లోనూ “స్టార్‌ మా” తన ఆధిపత్యం చాటింది. తెలుగు ఛానెల్స్‌ లో మాత్రమే కాదు, దేశం మొత్తం మీద మరే ఇతర  భాషలోని వినోద ఛానెల్స్‌ సాధించలేని అరుదైన రికార్డు ను సాధించింది. ఇటీవలే స్టార్‌ మాలో ప్రారంభమైన ‘నాగపంచమి’, ‘బ్రహ్మముడి’ సీరియల్స్‌ గత రికార్డులన్నింటినీ తిరగరాశాయి.  గత మూడేళ్లగా కొనసాగుతున్న రికార్డులను సైతం బ్రేక్‌ చేస్తూ ‘నాగపంచమి’ సీరియల్‌ 11556 (‘000 ఏఎంఏ), ‘బ్రహ్మముడి’ సీరియల్‌ 10372.2(‘000 ఏఎంఏ) సాధించింది. ఈ రికార్డులకు దూరంగా సన్‌టీవీలో ప్రారంభమైన ‘వనథై పోలా ’9661.2 (‘000 ఏఎంఏ);  స్టార్‌ ప్లస్‌లో ప్రారంభమైన ‘ఇమ్లీ’ 8814.1 (‘000 ఏఎంఏ), కలర్స్‌లో  ‘నాగిన్‌ – 5 సీజన్  8700.5 (‘000 ఏఎంఏ) తరువాత స్థానాలలో నిలిచాయి.

ఇదే రీతిలో తెలుగు సినీ అభిమానుల వినోద కేంద్రంగా స్టార్‌మా మూవీస్‌ , జెమినీ టీవీని వెనక్కి నెట్టి 228 జీఆర్‌పీల రేటింగ్‌ సాధించింది. ఇండియాలో నెంబర్‌1 మ్యూజిక్‌ ఛానెల్‌గా  స్టార్‌ మా మ్యూజిక్‌ స్పష్టమైన ఆధిక్యతను ఇతర మ్యూజిక్‌ ఛానెల్స్‌పై చూపింది. స్టార్‌ మా మ్యూజిక్‌ 75900 (‘000 ఏఎంఏ), ఎంటీవీ బీట్స్‌ కేవలం 65,213 (‘000 ఏఎంఏ)  మాత్రమే సాధించింది. సినిమా, సంగీతం, సీరియల్స్‌… వినోదం ఎలాంటిదైనా సగటు టీవీ అభిమానుల గమ్యస్ధానం మాత్రం స్టార్‌ మాత్రమే అని ఈ రేటింగ్స్‌ మరో మారు స్పష్టం చేస్తున్నాయి !

Related posts

చీపురుపల్లి పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

Bhavani

నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించండి

Bhavani

ట్రాజెడీ: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ భార్య మృతి

Satyam NEWS

Leave a Comment