29.7 C
Hyderabad
May 2, 2024 06: 51 AM
Slider ప్రత్యేకం

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో స్టార్ మా మహోత్సవం

star maa 1

ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యేందుకు స్టార్ మా నెట్ వర్క్ మహోత్సవం పేరుతో వినూత్న కార్యక్రమాలకు శ్రీ కారం చుట్టింది. అందులో భాగంగా హైదరాబాద్ లోని కెపిహెచ్ బి కాలనీ లో స్టార్ మా నెట్ వర్క్ నిన్న రాత్రి ఈ మహోత్సవం నిర్వహించింది.

అందరిని ప్రత్యక్షంగా కలుసుకుని ఆహ్లాదపరిచే ఈ కార్యక్రమంలో స్టార్ మా లో ప్రసారమయ్యే టాప్ సీరియల్స్ మనసిచ్చి చూడు, సిరి సిరి మువ్వలు నటీనటులు పాల్గొన్నారు. ఈ షో లో మరో ప్రత్యేకత ఏమిటంటే బిగ్ బాస్ తెలుగు 3 సీజన్ పార్టిసిపెంట్ శివజ్యోతి ఈ కార్యక్రమాన్ని ప్రెజెంట్ చేసింది. చల్లని సాయంత్రం వేళ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే వినూత్న కార్యక్రమం మహోత్సవం ను స్టార్ మా నెట్ వర్క్ నిర్వహించడం స్థానికులను ఆనందపరిచింది.

దాదాపు నాలుగు వేల మంది తమ కుటుంబాలతో సహా ఈ మహోత్సవానికి హాజరై ఉల్లాసంగా గడిపారు. సింగర్, డాన్సర్స్, నటీనటులు ప్రేక్షకులను అలరించారు. తెలుగు సినిమా లో తమదైన ముద్ర వేసిన  స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్ ఛానెల్స్ ప్రసారాలను శివజ్యోతి ప్రేక్షకులకు పరిచయం చేశారు.

శివజ్యోతితో కలిసి ఈ షో ను హోస్ట్ చేసిన శ్రీకర్ ప్రేక్షకులను కట్టిపడేశారు. విశేషంగా యవతను ఆకర్షిస్తూ రోజు రోజుకూ ప్రాముఖ్యతను పెంచుకుంటున్న స్టార్ మా మ్యూజిక్ ఛానెల్ ను శివజ్యోతి వీక్షకులకు పరిచయం చేసింది.

Related posts

వనపర్తి జిల్లాలో కరోనా విజృంభణ

Satyam NEWS

విద్వేషపూరిత ప్రసంగాలపై పాక్ ఆందోళన

Sub Editor

వలస కూలీ వరస…

Satyam NEWS

Leave a Comment