సేవ్ అమరావతి నినాదంతో సిద్దార్థ వాకర్స్ క్లబ్ నిరసన ర్యాలీ నిర్వహించింది. విజయవాడ సిద్ధార్థ కళాశాల నుంచి నగరంలో ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. అమరావతి ప్రజారాజధాని తరలింపుపై నిరసనలు హోరెత్తుతున్నాయి. రైతులు, రైతు కూలీలు తమ ఆందోళనలను తీవ్రం చేశారు.
ఈరోజు సాయంత్రం రాజధాని ప్రాంత రైతులు, రైతు కూలీల ఆధ్వర్యంలో కాగడాలతో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం 5.30 నిమిషాలకు ఎంఎస్ఎస్ భవన్ నుంచి ప్రారంభమయ్యే కాగడాల ప్రదర్శనలో రైతులు, రైతు కూలీలతోపాటు నారా లోకేశ్ పాల్గొననున్నారు. ఈ ప్రదర్శన మంగళగిరి ప్రధాన రహదారి మీదుగా సాగనుంది.