గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని టిడిపి నరసరావుపేట నియోజకవర్గ ఇన్ చార్జి చదలవాడ అరవింద్ బాబు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు వేల కోట్లు విడుదల చేసిందని దానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా 500 కోట్లు కలిపితే 2500 కోట్లు అవుతుందని, తక్షణమే వీటిని బకాయిలు చెల్లించేందుకు వినియోగించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటోందని ఆయన విమర్శించారు. ఇది చట్ట వ్యతిరేకం అని విమర్శించారు వెంటనే ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
previous post