29.7 C
Hyderabad
May 2, 2024 04: 42 AM
Slider ముఖ్యంశాలు

విఆర్ఏ పోస్టుల సర్దుబాటు పై స్టే

high court

రాష్ట్రంలో వీఆర్ఏ పోస్టుల సర్దుబాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇతర శాఖల్లోకి పంపుతూ జారీ చేసిన జీవోను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. జీవోల జారీకి ముందున్న యథాతథ స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియలో సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేయడం ద్వారా తమకు అన్యాయం జరుగుతుందంటూ రెవెన్యూ శాఖలోనే పని చేస్తోన్న 30 మంది ఆఫీస్ సబార్డినేట్లు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈ కేసులో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్ధిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీసీఎల్ఏ, చీఫ్ సెక్రటరీ, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ లతో పాటు పలు జిల్లాల కలెక్టర్లను పార్టీగా చేశారు.తెలంగాణ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా వీఆర్ఏలను రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా, సబార్డినేట్లుగా నియమించారని కేసులో పేర్కొన్నారు. శాస్త్రీయ అధ్యయనం లేకుండానే పోస్టులను రూపొందించారని, సృష్టించిన పోస్టుల అవసరం ఏ మేరకు ఉన్నదన్న అంశంపై ఎలాంటి ఎక్సర్ సైజ్ జరగలేదని ఆఫీస్ సబార్డినేట్స్ ఆరోపించారు.

దీని వల్ల తమకు పదోన్నతులు నిలిచిపోనున్నాయని ఆఫీస్ సబార్డినేట్స్ హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. రెండు రోజుల నుంచి వీఆర్ఏలకు పోస్టింగులు ఇస్తూ ఆయా జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఇప్పుడు హైకోర్టు స్టే ద్వారా వీఆర్ఏలు నిరాశకు గురవుతున్నారు.ప్రభుత్వం వీఆర్ఏలను రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 2451, రికార్డు అసిస్టెంట్ పోస్టులు 2113, ఆఫీస్ సబార్డినేట్/

చైన్ మెన్ లుగా 679, మున్సిపల్ శాఖలో వార్డు ఆఫీసర్లుగా 1266 పోస్టులు, నీటి పారుదల శాఖలో లష్కర్లుగా 5,073 పోస్టులు, మిషన్ భగీరథలో హెల్పర్లుగా 3372 పోస్టులను మంజూరు చేసింది. రాష్ట్రంలో 20,555 మంది వీఆర్ఏల్లో 16,758 మందిని వారి విద్యార్హతలను పోస్టులను కేటాయించారు. వీటి వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఆఫీస్ సబార్డినేట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

పవన్ ను కలిసిన రాజంపేట శ్రీనివాసరాజు

Satyam NEWS

రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన జూపల్లి

Satyam NEWS

బక్కోడి చేతికి బందుకు పట్టించిన సాయుధ పోరాటం

Satyam NEWS

Leave a Comment