38.2 C
Hyderabad
May 3, 2024 20: 34 PM
Slider ముఖ్యంశాలు

జగన్ రెడ్డి ఫొటోలు ఉన్న వాహనాల్లో రేషన్ డోర్ డెలివరి ఆపాలి

#CPIRamakrishna

జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్న వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీకి ప్రభుత్వం సిద్ధం కావటం ఎన్నికల కోడ్ కు విరుద్ధమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. రేషన్ డోర్ డెలివరీ ఎన్నికలయ్యేంత వరకు వాయిదా వేయాలని ఎన్నికల కమిషనర్ కు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు తర్వాతయినా సరే రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు వచ్చి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరిస్తారని అందరూ భావించారు. బాధ్యత స్థానంలో ఉన్న రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఎన్నికల కమిషన్ ను కించపరిచేలా మాట్లాడుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి వాయిస్ గా పేరుగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఎస్ఈసిని కించపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు అని రామకృష్ణ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏకగ్రీవాలపై ప్రకటనలు ఎందుకు ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదని ఆయన అన్నారు. ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా 125 జెడ్పీటీసీ, 2 వేలకు పైగా ఎంపీటీసీలను వైసిపి ఏకగ్రీవం చేసుకుందని, పోలీసులను ప్రయోగించి, ప్రలోభాలు, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి వైసిపి ఈ ఏకగ్రీవాలు చేసుకుందని ఆయన అన్నారు.

ఇలా దౌర్జన్యంగా ఏకగ్రీవాలు చేసుకునే పక్షంలో అసలు ఎన్నికలు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.

Related posts

నో ఫెస్టివల్: భోగిమంటల్లోజీఎన్‌రావు బోస్టన్‌ నివేదికప్రతులు

Satyam NEWS

మహారాష్ట్ర లో ఎన్కౌంటర్: ఒక మావోయిస్ట్ మృతి

Satyam NEWS

పైడితల్లి అమ్మ వారిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్

Satyam NEWS

Leave a Comment