27.7 C
Hyderabad
April 26, 2024 06: 02 AM
Slider ప్రత్యేకం

ఏఓబీ పరిధిలో కొఠియా ప్రజల భద్రతకు భరోసా కల్పించిన ఏపీ పోలీసులు..!

VijayanagaramPoliceSpecial

వివాదాస్పద కొఠియా గ్రామాల్లో ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించు కోకుండా ఒడిస్సా ప్రభుత్వం, అక్కడ పోలీసులు ఉద్దేశపూర్వకంగా అక్కడ గిరిజనులను,  ప్రజలను అడ్డుకోవడాన్ని పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది.

ఈ మేరకు పార్వతీపురం ఓఎస్డీ ఎన్ సూర్యచంద్ర రావు, జిల్లా ఎస్పీ రాజకుమారి, విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు ఆదేశాలతో కొఠియా సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎర్రంన్నాయుడు, పోలీస్ సిబ్బంది వివాదాస్పద గ్రామాల్లో పర్యటించారు.

అక్కడ ప్రజలు, గ్రామస్తులతో జిల్లా పోలీసులు మమేకమై, వారికి అందుతున్న అభివృద్ధి పథకాలు, అభివృద్ధి పనులు, ఇంకనూ వారి అవసరాలకు కావలసిన పనుల గురించి ప్రజలను ఆరా తీశారు. ఇందులో భాగంగా ప్రజలు అందరూ ఏపీ రాష్ట్ర పరిధిలోని తామంతా ఉండాలని కోరుకుంటున్నామని, తమ పిల్లలు కూడా ఆంధ్రరాష్ట్ర పాఠశాలల్లోనే చదువు సాగిస్తున్నారని చెప్పారు.

గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అక్కడ పరిస్థితులు గురించి పోలీసులు అక్కడి ప్రజల్ని అడిగి తెలుసుకుని, వారికి రక్షణగా పోలీస్ శాఖ ఉంటుందని, ప్రజలకు ఏ సమస్య వచ్చిన పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కొఠియా పోలీస్ స్టేషన్ ఉందన్నారు.

ప్రజలకు ఏ సమస్య వచ్చినా, నిస్సందేహంగా కొఠియా పోలీసులను సంప్రదించ వచ్చునన్నారు. ప్రజల రక్షణకు తామంతా సిద్దంగా ఉన్నామని ప్రజలకు బరోసా కల్పించారు. ఒడిష్షా ప్రజల రక్షణకు జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తమ సమస్యలను ముందుగా పోలీసువారికి తెలియపరిస్తే చాలన్నారు.

వారి రక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రజల స్వేచ్ఛ గా జీవించేందుకు జిల్లా పోలీసుశాఖ సిద్దంగా ఉందన్నారు. కోఠియాయా పరిధిలో  సారిక, నేరెళ్ళవలస, దొరల తాడివలస గ్రామాల  11 గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో కొఠియా పీఎస్ సిబ్బంది సందర్శించి, ప్రజలతో మమేకం ఆయ్యారు.

Related posts

చంద్రబాబు ఇల్లు ఖాళీకి నోటీసులు జారీ

Satyam NEWS

16 నుంచి 22 వరకు చిరంజీవి, పవన్ ల జన్మదిన వారోత్సవాలు

Satyam NEWS

సానియా మీర్జా షోయబ్ మాలిక్ ల బ్రేకప్?

Bhavani

Leave a Comment