40.2 C
Hyderabad
April 28, 2024 15: 44 PM
Slider ఖమ్మం

పర్యావరణ పరిరక్షణకు పటిష్ట చర్యలు

#Snehalatha Mogili

పర్యావరణ పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి పేర్నొన్నారు. ఐడిఓసి సమావేశ మందిరంలో పర్యావరణ పరిరక్షణపై ఆమె సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగే చర్యలను ఉపక్రమించాలన్నారు.

ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించేందుకు సామూహిక ఉద్యమ కార్యాచరణతో మిషన్‌ లైఫ్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారన్నారు. మిషన్‌ లైఫ్‌ పోస్టర్స్‌ను ఆమె విడుదల చేశారు.

మిషన్‌ లైఫ్‌, మన పర్యావరణాన్ని, ప్రకృతి పరిరక్షణ కోసం పౌరులు, ప్రజలు సామూహికంగా చర్యలు తీసుకోవడానికి కనీసం ఒక బిలియన్‌ భారతీయులను చైతన్య పరచడం అనగా 80% మంది గ్రామస్తులను మరియు పట్టణవాసుల యొక్క దినచర్యలను 2028 నాటికి పర్యావరణ అనుకూలంగా మార్చాలని మిషన్‌ లైఫ్‌ లక్ష్యాలను పేర్కొన్నారు.

పర్యావరణ అనుకూల చర్యల సాధన కోసం 7 కేటగిరీలలో 75 జీవిత చర్యల యొక్క సమగ్రమైన జాబితా గుర్తించబడిరదని, మిషన్‌ లైఫ్‌ పై సమగ్ర చర్యలను missionlife-moefcc.nic.in website లో ఉంచబడ్డాయి అని తెలిపారు. మిషన్‌ లైఫ్‌ పై అవగాహన సదస్సులను అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో మరియు వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా అన్ని మున్సిపాలిటీలలో మరియు మేజర్‌ గ్రామపంచాయతీలలో నిర్వహించాలని సూచించారు.

దానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు నోడల్‌ అధికారి అయిన పర్యావరణ ఇంజనీర్‌, ప్రాంతీయ కార్యాలయం వారికి పంపించిన ఎడల వారు మిషన్‌ లైఫ్‌ లో అప్లోడ్‌ చేస్తారు అని తెలిపారు. మిషన్‌ లైఫ్‌ యొక్క పోస్టర్లను, బ్యానర్లనుసంబంధిత కార్యాలయం నుండి కలెక్ట్‌ చేసుకోవాలని తెలిపారు.ఈ మిషన్‌ లైఫ్‌ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం పై శ్రద్ధ వహించాలని సూచించారు.

Related posts

త్రికోటేశ్వరనమహ: చేదుకో కోటయ్య ఆదుకో మమ్ము

Satyam NEWS

కరోనా మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నేత సాయం

Satyam NEWS

కుమ్మరి బస్తి లో విస్తృతంగా పర్యటించిన రజితపరమేశ్వర్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment