22.2 C
Hyderabad
December 10, 2024 10: 01 AM
Slider జాతీయం ప్రత్యేకం ముఖ్యంశాలు

ఇది నిజంగా విక్రమ్‌ లాండరేనా

vikram landar

చంద్రయాన్‌ 2 ప్రయోగంలో కనిపించకుండాపోయిన విక్రమ్‌ లాండర్‌ ఇదే నంటూ సోషన్‌ మీడియాలో ఒక ఛాయా చిత్రం చక్కర్లు కోడుతుండగా ఇది నిజంగా విక్రమ్‌ లాండర్‌ చిత్రాలా లేక మార్ఫ్ డు చిత్రమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత రెండు రోజులుగా అంతరిక్షం నుండి తీసిన చంద్ర ఉపరితలం యొక్క ఫోటోను ఇస్రో పంపిన ‘విక్రమ్‌ లాండర్‌’ గా పేర్కోంటూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ‘చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న కక్ష్య లో  చంద్రుని ఉపరితలం పై పడి ఉన్న విక్రమ్‌ లాండర్‌  థర్మల్‌ చిత్రం ఇదే అంటూ ఈ చిత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవతుంది. సెప్టెంబర్‌ 7వ తేదీ తెల్లవారుజామున 1.40 గంటల సమయంలో చందమామ మీద లాండింగ్‌ చేస్తున్న సమయంలో విక్రమ్‌ లాండర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఆ సంబంధాలు తెగిపోయినట్టు ఇస్రో తెలిపింది. అప్పటి నుంచి అది ఎక్కడ ఉందో ఆచూకీ తెలియలేదు. అయితే, చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌.. విక్రమ్‌ లాండర్‌ను గుర్తించింది విక్రమ్‌ లాండర్‌తో సంబంధాలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. విక్రమ్‌ లాండర్‌తో మళ్లీ లింక్‌ కావడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ చిత్రం నిజమా లేదా అబద్దమా అనే విషయాన్ని ఇస్రో దృవీకరించాల్సి ఉంది.

Related posts

వి.ఎస్.యూ లో ఘనంగా యువజనోత్సవాలు

Bhavani

తెలంగాణ ఉద్యమంతో బతుకమ్మకు గుర్తింపు

Satyam NEWS

సంక్షేమ పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్నాం

Satyam NEWS

Leave a Comment