28.7 C
Hyderabad
April 26, 2024 09: 30 AM
Slider వరంగల్

బడి బయట పిల్లలపై ములుగు జిల్లాలో సర్వే

#mulugu

బడి బయట పిల్లలు, దివ్యాంగ పిల్లల సర్వే చేయాలని ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులను ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని ఆదేశించారు. రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆదేశానుసారం జిల్లా లోని అన్ని ఆవాస ప్రాంతాలలో 2022-23విద్యా సంవత్సరం కు సంబంధించి ఈ సర్వే జరపాలని ఆయన కోరారు. ఈ సర్వే లో CRP లు, IERP లు పాల్గొని ఈ నెల 18 వ తేదీ వరకు పూర్తి చేయాలని చెప్పారు.

ఎలిమెంటరీ స్థాయి లో 6-14 సంవత్సరాల వయసు కల బడి బయట  పిల్లల సెకండరీ స్థాయి లో 15-19 సంవత్సరాల వయసు కల బడి బయట పిల్లల వివరాలు సేకరించాలని చెప్పారు. CRP లు, IERP లు రోజువారీగా, ఆవాస ప్రాంతం వారీగా సమగ్ర సర్వే చేయాలని చెప్పారు. ఇంతవరకు బడిలో నమోదు కాని పిల్లల, బడిలో నమోదు అయ్యి మధ్యలో బడి మానివేసిన పిల్లల, ఇతర జిల్లా కు మరియు రాష్ట్రాలకు వలస వెళ్ళి తిరిగి వచ్చిన పిల్లల వివరాలు పూర్తిగా సేకరించాలని చెప్పారు.

ఈ సందర్భంగా క్వాలిటీ కో ఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సర్వే ద్వారా సేకరించిన పిల్లల సమాచారం ను ప్రభంద్ పోర్టల్ లో నమోదు చేయాలని కోరారు. వారి ఆవాస ప్రాంతము దగ్గర లో గల పాఠశాల లో ప్రవేశం కల్పించాలి, పాఠశాల లో కొనసాగేటట్లు చుడాలి ఈ విద్యార్థుల వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ లో నమోదు చేయాలని చెప్పారు.

స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు,మండల విద్యాశాఖ అధికారులు ఈ సర్వే ను పరిశీలన చేయాలి. సర్వే అనంతరం తమ ఆవాస ప్రాంతము లో బడి బయట పిల్లలు లేనట్టయిటే ధృవీకరణ పత్రం ఇవ్వాలని చెప్పారు. 19-01-23 నుండి 25-01-23  రోజు వరకు మండల స్థాయి లో పూర్తి సమాచారం తయారు చేసి ప్రభంద్ పోర్టల్ లో నమోదు చేసి  సంతకం చేసిన కాపీ ని జిల్లా విద్యాశాఖ కార్యాలయం లో అందచేయాలని చెప్పారు.

Related posts

శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ

Satyam NEWS

శ్రీకాకుళం నగర పాలక సంస్థలో అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

Satyam NEWS

సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ

Satyam NEWS

Leave a Comment