40.2 C
Hyderabad
April 29, 2024 17: 19 PM
Slider నిజామాబాద్

అనుమానాస్పద వ్యక్తుల పట్టివేత

#kamareddy

గత కొద్దిరోజులుగా కామారెడ్డి జిల్లాలో చిన్న పిల్లలను కిడ్నాప్ కోసం ముఠాలు సంచరిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో అనుమానాస్పదంగా ఎవరు కనపడినా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురిని కాలనీ వాసులు గుర్తించారు. అందులో నలుగురు పారిపోగా ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని పెద్ద బజార్ లో ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించారు. ఇద్దరు చిన్నపిల్లలను కిరాణా షాపుకు తీసుకెళ్లడం కాలనీ వాసులు గమనించారు.

చిన్న పిల్లల కిడ్నాప్ ముఠా సంచారం అంటూ వస్తున్న వదంతుల నేపథ్యంలో కాలనీ వాసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా అందులో నలుగురు పారిపోయారు. దొరికిన మగమనిషి, ఆడ మనిషికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కాలనీకి చేరుకుని వివరాలు సేకరించారు. దొరికిన వ్యక్తులు తాడ్వాయి మండలానికి చెందిన బక్కోళ్ల భూమయ్య, కీసరి రాజవ్వగా గుర్తించారు. వీరు తాడ్వాయిలో కూలి పని చేసుకుంటారని, అడ్రస్ మర్చిపోయి వెతుక్కుంటూ పెద్ద బజార్ వెళ్లారని సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇటీవల చిన్నపిల్లల కిడ్నాప్ కోసం ముఠాలు సంచరిస్తున్నాయన్న వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు. కామారెడ్డిలో ఎలాంటి  ముఠాలు సంచరించడం లేదని, ఇప్పటికే ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనపడితే పోలీసులకు సమాచారం అందించాలనో, సోషల్ మీడియాలో ఎలాంటి దుష్ప్రచారం చేయవద్దని కోరారు

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలి

Satyam NEWS

వైన్స్ షాపులకు దరఖాస్తు ప్రక్రియ షురూ

Bhavani

హైకోర్టును ఆశ్రయించిన మాస్టర్ ప్లాన్ రైతులు

Satyam NEWS

Leave a Comment