29.2 C
Hyderabad
October 13, 2024 15: 06 PM
Slider వరంగల్

లక్నవరం సరస్సుకు అంతర్జాతీయ ఖ్యాతి తేవాలి

Laknavaram tank

తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శి C. పార్థసారధి వెల్లడించారు. అతి పెద్ద గిరిజనుల జాతర సమ్మక్క- సారాలమ్మ ల మేడారం జాతర సందర్భంగా తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ITDA ఏజెన్సీ పరిధిలోని ట్రైబల్ టూరిజం సర్క్యూట్ క్రింద ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. వరంగల్ – ములుగు రహదారిలో ఉన్న ప్రముఖ దేవాలయం శ్రీ గట్టమ్మ మందిరం వద్ద సుమారు రూ. 7 కోట్ల 50 లక్షల తో నిర్మిస్తున్న హరిత హోటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సు వద్ద సుమారు 17 కోట్లతో నిర్మిస్తున్న కాటేజ్ ల నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. లక్నవరం సరస్సు ను ఎకో టూరిజం గా అభివృద్ధి చేయటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. సరస్సులో ఇంకా ఎన్నో ఐలాండ్ లు ఉన్నాయని, వాటిని కూడా అభివృద్ధి చేయాలని టూరిజం అధికారులను ఆదేశించారు. లక్నవరం సరస్సు కు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి అనువైన ప్రదేశంగా ఉందన్నారు. లక్నవరం సరస్సు లోని లాంచీల పనితీరును పరిశీలించారు. లాంచీల నిర్వాహణ, పర్యాటకులకు అందిస్తున్న సౌకర్యాల పై అధికారులతో చర్చించారు. మిగిలిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను కోరారు.

Related posts

బాధిత కుటుంబానికి టీఎస్‌ఆర్టీసీ భ‌రోసా

Bhavani

పోస్టుపోన్: శ్రీవారి భక్తులకు పాక్షిక విజయం

Satyam NEWS

కర్నాటకలో ఒంటరిగానే పోటీ: అమిత్ షా

Satyam NEWS

Leave a Comment