29.7 C
Hyderabad
April 29, 2024 07: 13 AM
Slider నెల్లూరు

నెల్లూరు కోర్టులో చోరీ న్యాయవ్యవస్థకే మాయని మచ్చ

cpi-ramakrishna

వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రధాన నిందితుడుగా ఉన్న ఫోర్జరీ పత్రాల కేసులో ఆధారాలను నెల్లూరు కోర్టు నుండి ఎత్తుకుపోవడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. మంత్రిగా కాకానికి శిక్ష పడుతుందనే సాక్ష్యాల దొంగతనం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు.

నెల్లూరు కోర్టు లాకర్ ఉన్న సాక్ష్యాల దొంగతనం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని వమ్ము చేసేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తక్షణమే నిందితుల బెయిల్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు కోర్టులో చోరీ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించి సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు చేపట్టి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రామకృష్ణ అన్నారు.

Related posts

పొన్నపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన కాసు వెంకట కృష్ణారెడ్డి

Satyam NEWS

బాసరలో నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన తహశీల్దార్ జయశ్రీ

Satyam NEWS

Leave a Comment