33.7 C
Hyderabad
April 29, 2024 00: 22 AM
Slider ప్రత్యేకం

పన్ను చెల్లింపుదారులను మోసం చేసిన నిర్మల

nirmala 8

వ్యక్తిగత ఆదాయపు పన్నుదారులను కేంద్ర ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తున్నది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన పన్ను రాయితీలు, పర్సెంటేజ్ లు దారుణమోసమేనని లెక్కలు తేలుస్తున్నాయి. ఓల్డ్ టాక్సు విధానం, న్యూ టాక్సు విధానం పేరుతో రెండు స్కీమ్ లు ప్రవేశ పెట్టి ఈ రెండింటిలో దేనినైనా పాటించవచ్చునని ఎంతో ఉదారంగా ప్రకటించిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో మోసపూరితంగానే వ్యవహరించినట్లు నిపుణులు అంటున్నారు.

పాత పన్ను చెల్లింపు విధానానికి, కొత్త పన్ను చెల్లింపు విధానానికి పోల్చి చూస్తూ నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదు. పాత పన్ను చెల్లింపు విధానం ప్రకారం 20 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు చెల్లించాల్సిన పన్ను 2,39,500 అవుతుంది కాగా కొత్త పన్ను చెల్లింపు విధానం కారణంగా అదే మొత్తానికి 3,37,500 పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 20 లక్షల రూపాయల వార్షిక ఆదాయం గలవారికి కొత్త విధానం ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ ఉండదు. 80సి, 80సిసిడి, 80డి, హెచ్ ఆర్ ఏ వెసులు బాటు ఉండదు.

అందువల్ల పన్ను చెల్లించాల్సిన మొత్తం 20 లక్షలు అలాగే ఉంటుంది. దీనికి 3,37,500 రూపాయల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పాత పన్ను విధానం ప్రకారం 50 వేలు స్టాండర్డ్ డిడక్షన్, 80 సి కింద 1.5 లక్షలు, 80సిసిడి కింద 50 వేలు, 80 డి కింద 25 వేలు, హెచ్ ఆర్ ఏ కింద 3 లక్షల మినహాయింపు ఉంటుంది. ఇవన్నీ కలిలిపితే 14.25 లక్షలు అవుతుంది. పన్ను చెల్లించాల్సిన మొత్తం 14.25 లక్షలుగా ఉంటుంది. దీనికి పన్నుగా రూ. 2,39,500 చెల్లిచాల్సి ఉండేది. చూడండి ఎంత తేడా ఉందా? ఇంత అంకెల గారడీ అవసరమా?  

Related posts

టీడీపీ బస్ యాత్ర కు ఎండను సహితం లెక్క చేయకుండా…!

Bhavani

సిఎం రిలీఫ్ ఫండ్ కు ముఖ్యమంత్రి కార్యాలయం బ్రేక్

Satyam NEWS

డెవెలప్మెంట్ టైం: పట్టణ అభివృద్ధికి నిధులుఇవ్వండి

Satyam NEWS

Leave a Comment