28.7 C
Hyderabad
April 28, 2024 05: 24 AM
Slider నిజామాబాద్

ఆర్మూర్ లో ఘనంగా టాలెంట్ షో

#armoor

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని  ‘విజయా హైస్కూల్’లో ప్రతి సంవత్సరం జరుపుకునే ‘టాలెంట్ షో’ని ఘనంగా జరుపుకున్నారు.  వివిధ రంగాలలో కృషిచేసిన విద్యార్థులకు మెమోంటోను అందజేశారు. ముఖ్య విషయం ఏమిటంటే ఎవరైతే ప్రతిభను కనబరిచినారో వారి తల్లిదండ్రులను పిలిచి మరీ సత్కరించటం అన్నది ఎంతో గొప్ప విషయం. కార్యక్రమంలో నటీమణి డబ్బింగ్ జానకి, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నటీమణి డబ్బింగ్ జానకి మాట్లాడుతూ “ఎన్ని భాషలు నేర్చుకున్నా మన మాతృభాషను మరిచిపోకుండా మాతృభాషలో మాట్లాడటం మరిచిపోవద్దు. కనుక సాధ్యమైనంత వరకు తెలుగు భాషలోనే మాట్లాడాలి. ఇంత చక్కటి స్కూల్ ను చూడటం మొదటిసారి. ఇంత మంచి విద్యాసంస్థను నడుపుతున్న సంస్థ అధికారిణి  డా. అమృతలత గారిని పాఠశాల ప్రధానోపాధ్యాయిని కవితా దివాకర్ ని ఎంతగానో అభినందిస్తున్నాను.” అని అన్నారు.

అలాగే తెలంగాణ సారస్వత పరిషత్ చీఫ్ సెక్రటరీ జె.చెన్నయ్య మాట్లాడుతూ నేను పాశ్చత్య దేశాలకు వెళ్ళినప్పుడు ఎంతోమంది విద్యార్థులు నిజామాబాద్, ఆర్మూర్లో ఉన్న విద్యాసంస్థలైన “విజయా హైస్కూల్ నుండి” వచ్చాము అన్నప్పుడు ఎంతగానో గర్వించాను అన్నారు. ఇంకా సుప్రసిద్ధ మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యగారి వంసతలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని కవితా దివాకర్, విజయా సంస్థ అధినేత అయిన డా. అమృతలత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

Related posts

అభివృద్ధిలో రాష్ట్ర సర్కార్ కు పూర్తి సహకారం అందిస్తాం

Satyam NEWS

నకిలీ డియస్పి అరెస్ట్

Sub Editor 2

3లక్షల పైనే

Bhavani

Leave a Comment