27.7 C
Hyderabad
May 4, 2024 07: 08 AM
Slider విజయనగరం

డబ్బులిచ్చి దాడులు చేయటం ఎంతవరకు సమంజసం…?

#YSRCP Vijayanagaram

రామతీర్థం నీలాచలం కొండ వద్ద జరిగిన ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి మరీ ఆ పార్టీ నేతలు చేసిన దాడులను ప్రశ్నించారు. డబ్బులిచ్చి మరీ దాడులను ఆ పార్టీ చేయించిందని ఆరోపించారు. విజయనగరం ఎమ్మెల్యే స్వామి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీ నేతలు మామిడి అప్పలనాయుడు, డాక్టర్ వి ఎస్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ నడిపిన శ్రీనివాసరావు, ఎస్ వి వి రాజేష్ లు అన్నారు.

ఎమ్మెల్యే కోలగట్ల నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరంతా మాట్లాడారు. రామతీర్థ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోని వివిధ పదవులు నిర్వహించిన అశోక్ గజపతిరాజు, రామతీర్థ ఆలయానికి చైర్మన్ గా కూడా వ్యవహరించారు ఎందుకు ఆలయాన్ని అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.

 సంఘటన జరిగిన వెంటనే అశోక్ గజపతిరాజు ఎందుకు స్పందించలేదని, నిర్లక్ష్యం వారి కాదా అని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా హుందాగా ఉండి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకపోగా డబ్బులు ఇచ్చి దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు దర్యాప్తును వేగవంతం చేయండి, దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పవలసిన ప్రతిపక్షాలు, మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రసంగాలు చేస్తూ, దోషులను రక్షించే విధంగా ప్రయత్నాలు చేస్తూ, తమ పార్టీ ప్రజాప్రతినిధుల పైన, పార్టీ నేతల పైన దాడులకు దిగడం విచారకరమన్నారు.

సీఎం జగన్  దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని, ఇలాంటి తరుణంలో ఘటనలు జరగడం విచారకరమని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చట్టం తన పని తానూ చేసుకు పోతుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు మతాలను వాడుకొని, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు.

చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో రామతీర్థం కు అధికార హోదా ఎందుకు కల్పించలేదని, మౌలిక వసతులు, సరైన రక్షణ ఎందుకు కల్పించలేదని అన్నారు.మూడు రాజధానుల ఏర్పాటు సమయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందని, తమ రాజకీయ లబ్ధి కోసం చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

టీడీపీ నేతలు మయూరి జంక్షన్ వద్ద నిరసన ప్రదర్శన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆలయానికి రక్షణ కల్పించకపోగా, మాజీ సీఎం చంద్రబాబు వస్తేనే అశోక్ గజపతిరాజుకు రామతీర్థం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు,  అశోక్ గజపతి రాజులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి, రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.

ఘటనపై ప్రభుత్వం , పోలీసు యంత్రాంగం విచారణను వేగవంతం చేసిందని, త్వరలోనే దోషులు ఎవరనేది బయటకు వస్తారన్నారు. దుండగులను శిక్షించాలి అన్నది మా అభిమతమన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల పైన, శాసన సభ్యుల పైన తెలుగుదేశం పార్టీ నేతల ప్రోత్సాహంతో కార్యకర్తలు భౌతిక దాడులకు పాల్పడడం సరికాదన్నారు.

ఈ మీడియా నగర పాలక పార్టీ నేతలు ఆసాపు వేణు, పార్టీ నేతలు సంఘం రెడ్డి బంగారు నాయుడు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రెడ్డి గురుమూర్తి, డీసీఎంఎస్ డైరెక్టర్ కెల్ల త్రినాధ్, బోధన అప్పారావు, అల్లు చాణక్య, ముచ్చు శ్రీను,  జీ వి రంగారావు, వై. కుమారస్వామి, బోడ సింగి ఈశ్వరరావు, మండల పార్టీ నేతలు బూర రామునాయుడు, సత్తిరాజు, బోధ అప్పల కృష్ణ, తుమ్మగంటి బంగారు నాయుడు తదితరులు ఉన్నారు.

Related posts

ఈ నెల 10న 12వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం కలెక్టరేట్ వ‌ద్ద లెక్క‌కు మించి మ‌హిళా పోలీసులు…!

Satyam NEWS

మునుగోడులో టీఆర్‌ఎస్‌దే గెలుపు

Murali Krishna

Leave a Comment