38.2 C
Hyderabad
May 5, 2024 19: 51 PM
Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రం కోట‌వ‌ద్ద‌కు టీడీపీ కార్మికు చైత‌న్య బ‌స్ యాత్ర‌

#atidi

టీడీపీ టీఎన్టీయూసీ  రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్క రఘురామరాజు  ఆధ్వర్యంలో టెక్కలి నుండి కుప్పం వరకు చేస్తున్న “కార్మిక చైతన్య బస్సు యాత్ర” ల విజయనగరం  కోట జంక్షన్ కు చేరుకుంది. ఈ మేర‌కు విజ‌య‌న‌గ‌రం నియోజ‌క వ‌ర్గ ఇంచార్జ్ అదితీ గ‌జ‌ప‌తి రాజు ఆధ్వ‌ర్యంలో  దేశం నేత‌లు…ముందుగా కోట జంక్షన్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన పార్టీ నాయకులు, అనంతరం జంక్షన్ లో భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, కూరగాయల కార్మికులు, తోపుడు బళ్ళు కార్మికులు హమాలీలు మరియు వివిధ రంగాల కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడమే కాకుండా, ప్రస్తుత వైకాపా పాలనలో కార్మికులకు జరుగుతున్న అన్యాయం పై వారికి వివరించి వారిలో చైతన్యం తీసుకువచ్చేలా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  రాబోయే ఎన్నికలలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే కార్మికులను  అన్ని విధాలుగా ఆదుకుని, వారి కుటుంబాలను ఆర్ధికంగా బలోపేతం చేసేలా కృషి చేస్తారని, అందుచేత కార్మికుల శ్రేయస్సు కోసం 2024 లో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వాన్ని తెలిపించాలని కోరారు. 

అనంతరం బాలాజీ జంక్షన్ జంక్షన్ లో డా బి.ఆర్. అంబెడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి, జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద అంగన్వాడీలు, సర్వ శిక్ష అభియాన్  ఉద్యోగస్తులు చేస్తున్న నిరసనకు పార్టీ నాయకులు అందరు సంఘీభావం తెలిపారు.  ఈ సందర్బంగా రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆనందంగా లేరని, ఈ ప్రభుత్వం అన్ని రంగాలను, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా వారికి తీరని అన్యాయం చేసి భవిష్యత్తును నాశనం చేసిందని అన్నారు.  

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, పార్లమెంట్ టీఎన్టీయూఈ అధ్యక్షులు విక్రమ్ జగన్నాధం, పార్లమెంట్ టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి  రౌతు శ్రీవాసరావు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి. రాజు, పట్టణ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రసాదుల లక్ష్మి వరప్రసాద్, ఆల్తి బంగారుబాబు, పార్టీ నాయకులు కర్రోతు నర్సింగరావు, జిల్లా కార్యాలయ కార్యదర్శి రాజేష్ బాబు, నియోజకవర్గ  గొంప ఆనందరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హుజూర్ నగర్ అభివృద్ధికి శాయశక్తులా కృషి

Satyam NEWS

మిర్యాలగూడతో పాటు వైరా ఇవ్వకపోతే ఒంటరిగానే పోటీ

Satyam NEWS

త్వరలో ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం

Satyam NEWS

Leave a Comment