31.7 C
Hyderabad
May 2, 2024 07: 53 AM
Slider కృష్ణ

వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్పు దుర్మార్గమైన చర్య

#telugudesham

ఎన్టీఆర్ వైద్య  విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు  తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ ఎన్.టి.ఆర్.జిల్లా తిరువూరు తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్ష నాలుగో రోజు కు చేరింది. ఈ నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన తిరువూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్  శావల దేవదత్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గారి హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

ఎన్టీ రామారావు  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఆయన్ని గౌరవిస్తారు. ముఖ్యంగా వైద్య విద్యా రంగంలో పెను మార్పులు తీసుకువచ్చిన మహానేత ఎన్టీ రామారావు. ప్రైవేటు వైద్య కళాశాలలు అన్నీ ఒక యూనివర్సిటీ క్రిందకు తీసుకురావాలని ఒక మహా సంకల్పం తో పని చేసి కార్యరూపంలోకి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ భారత్ దేశంలోనే మొదటి హెల్త్ యూనివర్సిటీ. అటువంటి మహానుభావుడి పేరు మార్చి ఇవాళ వైయస్సార్ పేరు పెట్టడం చాలా దారుణం అన్నారు.

తిరువూరు 17వ వార్డు టిడిపి కౌన్సిలర్ అబ్దుల్ హుస్సేన్ మాట్లాడుతూ దొడ్డి దారిన జీవో తెచ్చి ఎన్టీఆర్ పెరు తొలగించి వైయస్సార్ పేరు పెట్టటం  దుర్మార్గపు  చర్య అని వెంటనే ఎన్టీఆర్ పేరు పెట్టాలని, ఎన్టీఆర్ పేరు పెట్టేదాకా ఎంత ఉద్యమానికైనా వెనకాడమని హుస్సేన్ అన్నారు.

Related posts

రూ.120 కోట్లతో ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం విస్తరణ

Satyam NEWS

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రధమ ప్రాధాన్యం

Satyam NEWS

ఒక సమాజంగా మనం విఫలమవుతున్నాం

Satyam NEWS

Leave a Comment