38.2 C
Hyderabad
April 29, 2024 21: 31 PM
Slider కడప

విద్యార్ధులతో ప్రభుత్వ రాక్షస క్రీడకు ఫుల్ స్టాప్ పెట్టిన సుప్రీంకోర్టు

#srinivasreddy TDP

పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చాలా పోరాటం చేశారు. పరీక్షల రద్దు కోసం పోరాడి విజయం సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడిన రాక్షస క్రీడ ముగిసింది. రెండు నెలల పోరాటం తరువాత జగన్ ప్రభుత్వం  దిగొచ్చి పరీక్షలు రద్దు చెయ్యడం సంతోషకరం అని రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు.

సుప్రీం కోర్టు తీర్పుతో ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్‌, పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. మొండి పట్టుదలకు పోకుండా ఏప్రిల్ 18 న నారా లోకేష్ మొదటి లేఖ రాసినప్పుడే పరీక్షలు రద్దు చేసి ఉంటే విద్యాసంవత్సరం వృధా కాకుండా ఉండటంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయం ఉండేదని ఆయన అన్నారు.

మానవత్వంతో ఆలోచించి ఉంటే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇంత మానసిక ఆందోళన ఉండేది కాదు, జగన్ ప్రభుత్వ ముర్ఖత్వం వల్ల ఈ  పరిస్థితి వచ్చింది..తుగ్లక్ నిర్ణయాలతో రెండు నెలల పాటు విద్యార్థులను హింసించారు అని ఆయన వ్యాఖ్యానించారు.

విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పరీక్షలు నిర్వహించొద్దని ప్రభుత్వాన్ని కోరారు. కరోనా విలయ తాండవాన్ని లెక్కచేయకుండా ముఖ్యమంత్రి జగన్ పట్టుదలకు పోయి పరీక్షలు నిర్వహించాలని చూశారు. కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేశాయి.

నారా లోకేష్ చేసిన పోరాటం ఫలించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం దిగి వచ్చింది అని ఆయన అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో చివాట్లు తినే పరిస్థితి మరోసారితెచ్చుకోకండి. ఇప్పటికైనా ప్రతిపక్షం అడిగే న్యాయమైన డిమాండ్లు పరిగణనలోకి తీసుకోవాలని జగన్ రెడ్డి ని కోరుతున్నాను అని ఆయన అన్నారు.

Related posts

మెసేజ్ ఓరియెంటెడ్ “ఐడెంటిటీ’ మూవీ రివ్యూ

Bhavani

విజయనగరం పోలీసు బాస్ ఆకస్మిక తనిఖీ.. స్టేషన్ తెలుసా…?

Satyam NEWS

యాదాద్రి వద్ద భారీ ఎత్తున పట్టుబడ్డ బంగారం

Satyam NEWS

Leave a Comment