42.2 C
Hyderabad
May 3, 2024 15: 06 PM
Slider ముఖ్యంశాలు

జగన్ మూడేళ్ల పాలనలో నకిలీ రత్నాలుగా మారిన నవరత్నాలు

Tulasireddy

జగన్ మూడేళ్ల పాలనలో నవరత్నాలు నకిలీ రత్నాలుగా, రంగు రాళ్లు గా, గులక రాళ్ళు గా, గుండ్రాల్లుగా మారాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి విమర్శించారు.

పేదలందరికీ ఇళ్లు నవరత్నాలలో ఒక అంశం అని, 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 60 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తే జగన్ మూడేళ్ల పాలనలో మంజూరైన ఇళ్లు 15.60 లక్షలు కాగా, పూర్తి అయినవి కేవలం 60783 మాత్రమేనని స్పష్టం చేశారు.

మద్య పాన నిషేధం నవరత్నాలలో ఒకటి. కానీ మద్యం ద్వారా రాబోవు 12 సంవత్సరాల కు వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 9.62 శాతం వడ్డీతో రూ.8300 కోట్లు అప్పు తీసుకుందని, దీని బట్టి సమీప భవిషత్తులో మద్యపాన నిషేదం ఉండదని, ఇది మాట తప్పడమే అవుతుందని, మహిళలను నమ్మించి మోసగించడం అన్యాయం అని పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ నవరత్నాలలో ఒకటి. 2007 లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, సకాలంలో నెట్వర్క్ ఆసుపత్రి లకు బిల్లులు చెల్లించని కారణంగా జగన్ పాలనలో ఆరోగ్య శ్రీ అనారోగ్య శ్రీ గా మారిందని ఆరోపించారు.

ఆరోగ్య శ్రీ డబ్బులు రోగుల ఖాతాల్లో వేయాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశం మరిన్నీ చిక్కులు తెస్తుందని, రోగులు ముందుగా బిల్లులు చెల్లిస్తే తప్ప ఆసుపత్రులు అడ్మిట్ చేసుకోవని, దీని వల్ల సకాలంలో వైద్యం అందక రోగులు చనిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద రోగుల పట్ల ముఖ్యమంత్రి యమధర్మరాజుగా మారడం శోచనీయం అని తులసి రెడ్డి పేర్కొన్నారు.

Related posts

కొన్ని ప్రాంతాల నుంచి రష్యన్ సేనల ఉపసంహరణ

Bhavani

డీఆర్సీ సమావేశంలో విజయనగర సమస్యలపై డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

Satyam NEWS

‘బెదురులంక 2012’ ప్రపంచంలోకి తీసుకెళ్లిన వీడియో

Bhavani

Leave a Comment