33.7 C
Hyderabad
April 30, 2024 00: 52 AM
Slider మహబూబ్ నగర్

అక్రమ ఇసుక, సారా సరఫరా పాఠాలు చెబుతున్న టీచర్

#Kollapur Leaders

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ లో అంతర్భాగమేనా? లేక స్వంతంత్ర్య దేశమా? ఇక్కడ జరుగుతున్న ఇసుక దందా, సారా దందా చూస్తుంలే ఈ అనుమానం రాకమానదు.

అవినీతి లేని పాలనను అందిస్తామని అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తామని పలికి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన ఎమ్మెల్యే సంవత్సరంన్నర కాలంలోనే ఇసుక దందాలు బెల్లం దందాలకు విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారని కొల్లాపూర్ పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో కొల్లాపూర్ పట్టణ కౌన్సిలర్ లు సింగిల్ విండో డైరెక్టర్ లు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆరోపించారు.

గత రెండు రోజులుగా బయటపడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన బీరం వెంకట రామిరెడ్డి కాల్ రికార్డింగుల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కోడెర్ మండలానికి చెందిన ఎమ్మెల్యే  కజిన్ బ్రదర్ వెంకట రామిరెడ్డి అక్రమ దందాలకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తూ అధికారులను విచ్చలవిడిగా నానా బూతులు తిడుతూ అక్రమ సంపాదనకు తెరలేపాడని వారన్నారు.

ఆడియో పరంగా అన్ని ఆధారాలు ఉన్నా కూడా ఎమ్మెల్యే తన కేమి సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తున్నారని వారన్నారు. తన కుటుంబ వ్యక్తి కాబట్టి అతని పేరుతో కాకుండా కొల్లాపూర్ పోలీస్టేషన్ లో పార్టీ కార్యకర్తల తో ఫిర్యాదు చేయటం ఈ అక్రమ దందాకు ప్రోత్సహించటమేనని వారు ఆరోపించారు.

ఒక బాధ్యత గల ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యా బుద్ధులు నేర్పాల్సిన వారు అక్రమ దందాలు ఎలా చేయాలి పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలి అంటూ నీతులు బోధించటం సమాజానికే సిగ్గుచేటని వారు విమర్శించారు. ఇలాంటి వ్యక్తి ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తున్న వనపర్తి మండలం దత్తాయపల్లి గ్రామ ప్రైమరీ స్కూల్ విధుల నుంచి తొలగించాలని  డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలో సంవత్సరంన్నర కాలంలో అనేక అక్రమ ఇసుక బెల్లం దందాలు పెరిపోయాయని అధికారం వుందికదా అని అమయకుల మీద దాడులు కేసులు పెడుతూ కక్ష సాధింపు రాజకీయాలకు ఎమ్మెల్యే పాల్పడుతున్నారని ఇంకా చాలా ఉన్నాయని వటాన్నిటిపై కూడా పై సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్తామని వారు ఈ సందర్బంగా తెలిపారు.

ఈ విలేకరుల సమావేశంలోమాజీ ఎంపీపీ నిరంజన్ రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎగ్బాల్, కొమ్మ వెంకటాస్వామి, మాజీ సర్పంచ్ నాగరాజు, సింగిల్ విడో డైరెక్టర్ పసుపుల నర్సింహ, కౌన్సిలర్ లు రహీంపాషా, రమ్య, శిరీష కిరణ్, జ్యోతి శేఖర్, శ్రీలక్ష్మి వేణుగోపాల్ పాల్గొన్నారు.

ఇంకా టీఆర్ఎస్ నాయకులు బొరెల్లి మహేష్, కేతూరి ధర్మతేజ, సత్యం, వేణుగోపాల్ గౌడ్, బాలస్వామి గౌడ్, హరిసింగ్, వెంకటయ్య, దిలీప్, ఖాదర్ పాషా తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

పాఠశాలలో  కాలనిర్ణయ పట్టిక ప్రకారమే నిర్వహించాలి

Satyam NEWS

కాలువ నిర్మాణంపై కాంగ్రెస్ ఆందోళ‌న‌

Sub Editor

జగన్ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ప్రశంసల జల్లు

Satyam NEWS

Leave a Comment