33.7 C
Hyderabad
April 28, 2024 00: 06 AM
Slider అనంతపురం

టీచర్ గా మారిన మంత్రి ఉషాశ్రీ చరణ్

నేడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కే.వి.ఉషాశ్రీచరణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరో తరగతి విధ్యార్ధులకు ఇంగ్లీష్ లో పాఠాలు బోధించి విధ్యార్ధులను ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు.

సీఎం వై.యస్.జగన్ ప్రభుత్వంలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తూ అందిస్తున్న మెరుగైన విద్యా బోధనపై మంత్రి ఉషాశ్రీచరణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్ధుల భవిష్యత్తుకు పునాదులు పాఠశాలలు అలాంటి ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఒక్క విద్యార్ధికి నేడు చక్కటి విద్యను అందిస్తున్నామని అన్నారు. విద్యార్ధుల కోసం విద్యారంగాన్ని ప్రోత్సహించడంలో జగనన్న ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది అని తెలియజేశారు.

Related posts

సిటిజెన్ షిప్ గాడ్:దేవుళ్ళు మైనర్ లే పౌరసత్వం కావాలి

Satyam NEWS

భారత ఆర్మీకి త్వరలోనే ప్రత్యేక ఆడియో పాట

Sub Editor

న్యాయం చెయ్యాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment