27.7 C
Hyderabad
April 30, 2024 09: 30 AM
Slider ప్రత్యేకం

మందు షాపుల వద్ద కాపలా డ్యూటీ ఎవరిదో తెలుసా?

#Wines Shop at Srikakulam

వైన్స్ షాపుల వద్ద అపరిమిత సంఖ్యలో గుమికూడుతున్న మందుబాబులను అదుపు చేసే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరికి ఇచ్చిందో తెలుసా? ఊహించండి. పోలీసులకు ఆ బాధ్యత అప్పగించింది అనుకుంటున్నారా? కాదు. ఎక్సయిజ్ శాఖ వారే చేస్తారు కదా మళ్లీ ఈ ప్రశ్న ఏమిటి అనుకుంటున్నారా?

కానే కాదు. బ్రాందీ, బీరు, విస్కీలు అమ్మే వైన్స్ షాపుల దగ్గర కాపలా కాసే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్లకు అప్పగించింది. టీచర్లా అని ఆశ్చర్య పోవద్దు. మీరు చదివింది కరెక్టే. టీచర్లకు వైన్స్ షాపుల వద్ద క్యూలు కట్టించేందుకు, తాగుబోతులతో సామాజిక దూరం పాటించేలా చేసేట్టు బాధ్యతలు అప్పగించారు.

యథా ప్రకారం లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వలేదు. కేవలం మౌఖిక ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠాలు చెప్పే టీచర్లను మద్యం దుకాణాల వద్ద డ్యూటీలు వేస్తున్నది. కరోనా విపత్తు సమయంలో టీచర్లను గత 40 రోజులుగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలకు వాడుకుంటున్నది.

క్వారంటైన్ డ్యూటీలు సరే మరి ఇదేమిటి?

ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టీచర్లకు డ్యూటీలు వేస్తున్నాయి. కూరగాయల మార్కెట్ల వద్ద క్యూలైన్లు పాటించేలా చూడటం, క్వారంటైన్ సెంటర్లలో యాజమాన్య బాధ్యతలు చూడటం, ఆహారం తదితర అవసరాలు అందుతున్నాయా లేక మరేదైనా సాయం కావాలా అనే విషయాలు పర్యవేక్షించడంలో టీచర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇంత వరకూ వారు ఆనందంగా చేస్తున్నారు. అత్యవసర సమయంలో వారి సేవలను కూడా వినియోగించుకుంటున్నందుకు టీచర్లు సంతోష పడుతున్నారు. వారికి దిన బత్తెం కూడా కొద్దో గొప్పో ఇస్తున్నారు. అది ఇవ్వకపోయినా వారు అడగడం లేదు కూడా.

తాగు బోతుల కంట్రోలుకు టీచర్లా?

అయితే విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపుల వద్ద కాపలాకు వేయడంతో ఒక్క సారిగా టీచర్ల మనసు నొచ్చుకున్నది. తాగుబోతులు పోలీసులకే కంట్రోలు కారు. అలాంటిది తమకు కంట్రోలు అవుతారా? అసలైనా తాగుబోతుల డ్యూటీ తమకు వేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం నాయకుడు మదుసూధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

టీచర్లు ఉన్నది పాఠాలు చెప్పడానికి తప్ప ఇలా తాగుబోతులను కంట్రోల్ చేయడానికి కాదని ఆయన అన్నారు. ఐఐటి జెఈఈ ఫోరం కన్వీనర్ కె లలిత్ కుమార్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టారు. టీచర్లను మందు షాపులకు కాపలాగా పెట్టడం తగదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.

Related posts

కెనడాలో TDF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ

Satyam NEWS

భద్రాచలం మాకు అప్పగించి మాట్లాడు కేసీఆర్

Bhavani

ఆరుగురిపై సస్పెన్షన్ వేటు

Bhavani

Leave a Comment