ఇండియా బయట కూడా తెలంగాణా పల్లె ఉన్నదా అని అందరూ ఆశ్చర్య పడేటట్లు చేసినారు కెనడా లో ఉన్న తెలంగాణా కుటుంబాల వాళ్ళు. తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం (టీడీఫ్ కెనడా) వారి సాంస్కృతిక విభాగం అయిన ‘తంగేడు’ (tangedu) ఆధ్వర్యం లో కెనడా లోని టొరంటో (బ్రామ్థన్) నగరం లోని డేవిడ్ సుజుకి స్కూల్ లో నిర్వహించిన బతుకమ్మ పండుగ అచ్చం తెలంగాణా పల్లె ను గుర్తు చేసింది. కెనడాలో స్థిరపడిన తెలంగాణ వాసులు సుమారు 600 మంది హాజరు అయి బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నరు. పూర్తి తెలంగాణా సాంప్రదాయ రీతిల బతుకమ్మ సంబరాలను జరుపుకొని విదేశాల్ల ఉన్న తెలంగాణా వాళ్ళు తమ సంస్కృతి ని నిలబెట్టుకోవడం కోసం ఎంతగా పాటు పడుతున్నారు అనే విషయాన్ని ప్రపంచానికి వెల్లడించారు. ఆహ్లాద కరం ఆయన వాతావరణంలో అనేక మంది తెలంగాణా మహిళలు రంగు రంగుల బతుకమ్మ లను పేర్చి పాటలు పాడుకుంటూ సంతోషంగా జరుపుకున్నరు. ఈ సందర్భంగా పిల్లలకు వివిధ రకాల పోటీ లను కూడా పెట్టినారు. పెద్ద వాళ్ళు తెలంగాణా సంస్కృతి ల బతుకమ్మ పండుగ గొప్పదనాన్ని పిల్లలకు చెప్పినారు. తరువాత రక రకాల సాంప్రదాయ తెలంగాణా వంటకాల తో మంచి రుచికరమైన భోజనాలు కూడా వడ్డించారు. కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ, బంగారు తెలంగాణా అభివృద్ధికి కి పాటు పడుతూనే, తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలను నిలబెడుతూ ఉండే కార్య క్రమాలను చేస్తూ ఉంటామని అన్నరు. కార్య క్రమంలో పాల్గొని విజయ వంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత లు తెలిపినారు. ఈ కార్యక్రమంలో టీడీఫ్ కెనడా ఫౌండేషన్ కమిటి చైర్మైన్ గంట మాణిక్ రెడ్డి, బోర్డు అఫ్ ట్రస్టీస్ చైర్మన్ గార్లపాటి జితేంధర్, అధ్యక్షులు పిణీకేశి అమిత రెడ్డి, ఉపాధ్యక్షులు మూల కవిత తదితరులు పాల్గొన్నారు
previous post
next post