29.7 C
Hyderabad
April 29, 2024 10: 26 AM
Slider నల్గొండ

ఉపాధ్యాయ సమస్యలపై 29న జరిగే ధర్నా విజయవంతం చేయాలి

#HujurnagarTeachers

ఉపాధ్యాయులు  ఐక్యతతో సమరశీల ఉద్యమాలతో హక్కుల్ని సాధించుకోవాలని ఎస్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎస్ టి యు వార్షిక కౌన్సిల్ సమావేశంలో సదానందం గౌడ్ మాట్లాడుతూ నిర్వీర్యమౌతున్న ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడంలో ఉపాధ్యాయులు క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం సవతి ప్రేమను చూపుతుందని, వేల సంఖ్యలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు భర్తీకి నోచుకోకుండా ఉన్నాయని అన్నారు.ఏకీకృత సర్వీస్ రూల్స్ తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని  విమర్శించారు.

ఈనెల 29న, హైదరాబాద్ లో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో ఎస్ టి యు ముందు వరుసలో ఉంటుందని ఓరుగంటి నాగేశ్వరరావు బంధం వెంకటేశ్వర్లు అన్నారు.

 ఈ కార్యక్రమంలో ఎస్ టి యు నాయకులు వీర రాఘవులు, కరుణాకర్ రెడ్డి, కె.వి. సత్యనారాయణ, ఆర్ శ్రీనివాసరావు, యతిపతిరావు,కే.వి.ఎన్.మూర్తి, శివయ్య, బూర వెంకటేశ్వర్లు వివిధ మండలాల అధ్యక్ష్య, కార్యదర్శులు పాల్గొన్నారు.

Related posts

రాజన్న ఆలయంలో రేవతి నక్షత్రం ప్రత్యేక పూజలు

Satyam NEWS

ది ఎండ్: అవినీతికి పాల్పడిన సిఐ సస్పెన్షన్

Satyam NEWS

రైతులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్!

Bhavani

Leave a Comment