38.2 C
Hyderabad
April 29, 2024 19: 20 PM
Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రం పోలీసుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన‌ ఉపాధ్యాయుల ధ‌ర్నా

#teachersprotest

నేటి బాల‌ల‌ను రేప‌టి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ‌లు…వీరు. గ‌దుల‌లో ఉంటూ విద్యార్ధుల‌కు పాఠాలు చెప్పాల్సిన టీచ‌ర్లు వారు.అక‌స్మాత్తుగా ప‌ల‌క‌,బ‌లపం ప‌క్క‌న పెట్టి ద‌ర్నా,నిర‌స‌న అనే రెండు ప‌దాల‌ను ప‌ట్టుకుని  స‌మ‌స్య‌లకు వ్య‌తిరేకంగా పిలుపునిచ్చిన పోరాటానికి స‌న్న‌ధ్దం అయ్యారు.

రెండు ద‌శాబ్దాల క్రితం అంటే ఉమ్మ‌డి రాష్ట్రంలో  హైద‌రాబాద్ బ‌షీరాబాగ్ వ‌ద్ద జ‌రిగిన ధ‌ర్నా…త‌ల‌పించింది…ఏపీలోని విజ‌య‌న‌గ‌రంలోని క‌లెక్ట‌రేట్ వ‌ద్ద  ఉపాధ్యాయులు చేసిన ధ‌ర్నా. ఏపీటీఎఫ్,యూటీఎఫ్, వంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏక‌మై పీఆర్సీ  కోసం…ఎలాంటి ముంద‌స్తు ప్రచారం లేకుండానే క‌లెక్ట‌రేట్ ను ముట్టడించే య‌త్నానికి దిగారు

అయితే క‌లెక్ట‌రే్ట్ వ‌ద్ద ధ‌ర్నా చేస్తామ‌ని నామ‌మాత్రంగానే  కేవ‌లం రిప్రజంటేషన్ ఇచ్చి వెళ్లిపోతామ‌న్న స‌మాచారం ఇచ్చిన ఉద్యోగ‌,ఉపాధ్యాయ సంఘాలు..ఒక్క‌సారి వంద‌ల సంఖ్య‌లో వ‌చ్చి …పోలీసుల‌కు ప‌ని చెప్పారు. ప‌ర్య‌వ‌స‌నంగా అడిష‌న‌ల్ ఎస్పీ ఓఎస్డీ సూర్య‌చంద్ర‌ర‌రావు, ఇటీవ‌లే ప‌దోన్న‌తి వ‌చ్చిన మ‌రో ఏఎస్పీ అనిల్, అలాగే ట్రాఫిక్  డీఎస్పీ మోహ‌న్ రావు,దిశ డీఎస్పీ త్రినాధ్ లు రావాల్సిన ప‌రిస్థితిని వ‌చ్చింది.

ఉపాధ్యాయుల సంఖ్య‌తో పాటు పోలీసులు బందోబ‌స్తు కూడా అదే స్థాయిలో రావ‌డంతో….క‌లెక్ట‌రేట్ ప్రాంగణం రచ్చ‌ర‌చ్చ‌గా మారింది. ..మ‌డిమ తిప్పాడు…మాట త‌ప్పిన సీఎం జ‌గ‌న్ అంటూ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిరాదాలు  చేసి….క‌లెక్ట‌రేట్ లోకి చొచ్చు కెళ్లేందుకు య‌త్నించారు.

మ‌హిళా ఉద్యోగులు కూడా… తెగించి మరీ క‌లెక్ట‌ర్ గేట్ వ‌ద్ద నిన‌దించి మరీ ధ‌ర్నా చేసారు. ఒకానోక సంద‌ర్బంలో  క‌లెక్ట‌ర‌ట్ ప్ర‌ధాన గేట్ ను చొచ్చుకుని వెళ్లేందుకు స‌న్న‌ద్దం అయ్యారు.అయితే  ఆ స‌మ‌యంలో  బ్యారికేట్లు ,తాడులు  స్పెష‌ల్ ప్రొట‌క్ష‌న్ పోర్స్ పెట్టి  మ‌రీ పోలీసులు.. ఉపాధ్యాయుల‌ను అడ్డుకునే య‌త్నం చేసారు.

స్వ‌యంగా ఓఎస్డీ సూర్య‌చంద్ర‌రావు, ఏఎస్పీ అనిల్, దిశ డీఎస్పీ త్రినాధ్, అలాగే ఏఆర్ సిబ్బందికి తీవ్రంగా అడ్డుకున్నారు.అలాగే మ‌హిళ‌ల‌ను మ‌హిళా ఎస్ఐలు జ‌యంతి, బేగం, కూడా తీవ్రంగా అడ్డుకోవ‌డ‌తోఒకానోక సంద‌ర్భంగా  తోపులాట జ‌రిగి అంద‌రూ కింద‌ప‌డిపోయే ప‌రిస్థితి  వ‌చ్చింది.

అయితే  పోలీసులు గ‌ట్టిగా దృడ నిశ్చ‌యంగా వారంద‌రినీ అడ్డుకున్నారు. దీంతో ఉపాధ్యాయులంతా అక్క‌డే భైఠాయించి..నినాదాలు చేసారు. అనంత‌రం ఎన్టీఆర్ కూడ‌లి వ‌ద్ద మావ‌న‌హారంగా ఏర్ప‌డి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు  చేసారు. ఏదైనా దాదాపు రెండున్న‌ర  గంట‌ల పాటు జ‌రిగిన ఈ ధ‌ర్నా…పోలీసుల‌ను ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింద‌నే చెప్పాలి.

Related posts

కాంగ్రెస్ పాలన లో అభివృద్ధి కుంటుపడుతోంది

Satyam NEWS

డి.ఎస్.కె మ్యూజిక్ ద్వారా “తప్పించుకోలేరు” ఆడియో విడుదల!!

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు షాక్

Satyam NEWS

Leave a Comment