31.7 C
Hyderabad
May 2, 2024 08: 45 AM
Slider ముఖ్యంశాలు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు షాక్

#Y S Jaganmohan Reddy

ఆర్ధికంగా చితికిపోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల డిఏ నిలిపివేశారు. 2021 జులై వరకు చెల్లింపులతో పాటు 2021 జనవరి నుంచి చెల్లించాల్సిన కరవు భత్యాన్ని (DA) కూడా నిలిపివేశారు.

కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా ఆదాయం పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం జూలై 2021 వరకు డీఏ చెల్లింపు నిలిపేసింది.

రాష్ట్రం కూడా అదే పరిస్థితిలో ఉండటంతో కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు  ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కూడా కరవు భత్యాన్ని (DA) నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

2021 జులై వరకు చెల్లింపులతో పాటు 2021 జనవరి నుంచి చెల్లించాల్సిన కరవు భత్యాన్ని (DA) కూడా నిలిపివేస్తున్నట్లు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి  విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Related posts

హుజూర్ నగర్ ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి

Satyam NEWS

పోలీసుల ముందే ఎంపిటిసి అభ్యర్ధిపై వైసిపి దాడి

Satyam NEWS

నోముల మృతి‌ డీకే అరుణ దిగ్భ్రాంతి

Sub Editor

Leave a Comment