30.7 C
Hyderabad
May 13, 2024 02: 37 AM
Slider ముఖ్యంశాలు

జాతీయ బీసీ కమిషన్ కు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు

#national bc commission

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజాన్ని అంతమొందించాలని చూస్తున్నారని, ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన జర్నలిస్టులను ఎక్కడికక్కడ కేసులతో వేధిస్తున్నారని జాతీయ బీసీ కమిషన్ కు తీన్మార్ మల్లన్న ( క్యూ న్యూస్) ఫిర్యాదు పంపారు.

ఈ ఫిర్యాదును నాజా  జాతీయ అధ్యక్షుడు మురహరి బుద్ధారం బీసీ కమిషన్ కు అందజేశారు. వాస్తవిక కథనాలను పబ్లిష్ చేస్తుంటే పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని ఫిర్యాదులో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జర్నలిస్టులు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో తెలియజేశారు.

ఓ దొంగ స్వామి లీలలపై క్యూ న్యూస్ లో బాధితుల తరపున కథనాలు  రిలీజ్ చేస్తే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నిందలు వేస్తూ విచారణ పేరుతో పేరిట గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. చిన్న కేసుల విషయంలో కూడా పదే పదే పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని నోటీసులు సర్వ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తప్పు చేసిన వారిని వెనకేసుకు వస్తూ  వాస్తవ కథనాలను రిలీజ్ చేసిన వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రి వేళలో  పోలీసులు వాహనాల లో వచ్చి క్యూ న్యూస్ ఆఫీసు కు వచ్చి సోదాలు చేశారని, కొందరి నాయకుల అవినీతి అక్రమాలకు ఆధారాలు లేకుండా  డేటా, హర్డు డిస్కు లు తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయంపై డిజిపి, కమిషనర్ ఆఫ్ పోలీస్  లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, చిలకలగూడ పోలీసులపై అత్యుత్సాహం పై  చర్యలు తీసుకోవాలని జర్నలిజాన్ని రక్షించాలని ఫిర్యాదు చేశారు.

జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి ఫిర్యాదును స్వీకరించారు. 15రోజుల్లో నివేదికను అందించాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు.  

Related posts

గ్రామాల అభివృద్ధికి సాయం అందిస్తాం

Bhavani

తీర ప్రాంత గ్రామాల్లో ప‌ర్య‌టించిన స‌త్యం న్యూస్.నెట్…

Satyam NEWS

శాడ్:కారు మోపెడ్ ఢీ దంపతుల మృతి

Satyam NEWS

1 comment

Rodda Nagesh yadav August 10, 2021 at 6:58 PM

నా పేరు రొడ్డ నాగేష్
మాది మల్లేశ్వరం గ్రామం.పేంట్లవేల్లి మండలం.
కొల్లాపూర్ తాలుక.
మా అమ్మ పేరు రొడ్డ బాలమ్మ.w/o. బాలస్వామి మీద చెన్నంపల్లి శివార్ లో 3 ఎకరాల ల్యాండ్ కబ్జాకీ గురైంది అని బీసీ కమిషన్ కి ఫిర్యాదు చెయ్యడం జరిగింది. బీసీ కమీషన్ తల్లోజ్ ఆచరి సర్ గారు కొల్లాపూర్ RDO గారికి ఫైనల్ పట్టా సర్టిఫికెట్ లో బౌన్దరిస్ ప్రకారం వాల ల్యాండ్ ని వాలకు హ్యాండర్ చెయ్యమని.చెప్పారు.. RDO గారు.MRO గారికి చెప్పారు.ఇంత వరకు ఏలాంటి చర్యలు తీసుకోలేదుజాతీయ.బీసీ కమిషన్ ఆచరి సర్ స్పందించి మాకు న్యాయం చెయ్య గలరాని కోరుతున్నాం సర్.

రొడ్డ భాలమ్మ .కొడుకు రొడ్డ నాగేష్
ఫోన్:9652872035 వాట్సాప్.

Reply

Leave a Comment