40.2 C
Hyderabad
April 28, 2024 15: 58 PM
Slider ఖమ్మం

పోడు భూముల రక్షణకై ఖమ్మంలో పోరు జాతర చేసిన అడవి బిడ్డలు

#CPIML protest

పోడు రైతుల పై అక్రమ కేసులు ఎత్తివేయాలని, పోడు భూములకు పట్టాలు అందించాలని, రైతులపై నిర్బంధ కాండను విడనాడాలని  కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

వెంకటాయపాలెం నుండి గోపాలపురం, శ్రీ శ్రీ సర్కిల్, రోటరీ నగర్, ఇందిరా నగర్, ఖమ్మం జిల్లా కోర్టు, ఇల్లందు క్రాస్ రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించి అనంతరం ధర్నా చౌక్ ధర్నా చేశారు. అడవుల్లో ఏళ్ళుగా నివసిస్తూ గిరిజనులను చట్టప్రకారం గుర్తించాలని అందుకు సంబంధించిన లెక్కలను తమకు సమర్పించాలని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 2019 ప్రారంభమై అటవీ హక్కుల చట్టం 2006 వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆదేశించింది.

కానీ తెలంగాణ లో టిఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో ఆదివాసీలు ఇతర పేదలు జీవనాధారమైన అన్యాక్రాంతం మీద ఉన్న ఆక్రమిత అత్యున్నత కోర్టు ఆదేశాల పై లేదు హక్కులు కల్పించడం లేదని తెలిపారు. అడవుల్లోనే పుట్టి అడవుల్లోనే జీవిస్తూ అక్కడే మరణించే ఆదివాసీలను ఆక్రమణ దారులు అంటున్నది వారిపై అడవుల రక్షణ కోసం అనే సాకుతో దాడులు చేస్తున్నది సత్తుపల్లి పెనుబల్లి తల్లాడ ఏన్కూరు కొనిజర్ల కామేపల్లి రఘునాధపాలెం మండలాలలో అనేక గ్రామాలలో ఈ దాడులు జరుగుతున్నాయి.

సత్తుపల్లి మండలం రేగులపాడు లో గత 25 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములలో ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. గిరిజన మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు దాడులు దౌర్జన్యాలు చేస్తూ పైగా గిరిజనులపై అక్రమ కేసులు పెడుతున్నారు కొనిజర్ల మండలం నగర్లో సాగు చేసుకుంటున్న భూముల లో పత్తి పంటను పీకి ధ్వంసం చేస్తున్నారు బోర్డు సాగు దారులపై దౌర్జన్యాలు చేస్తూ నిరంతరం బాధలకు చేస్తున్నారు

అటవీ అధికారులు హరితహారం పేరుతో అక్రమాలకు పాల్పడుతూ పేదలను వేధిస్తున్నారని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అఖిల భారత రైతుకూలీ సంఘం తెలిపింది. ఆదివాసీలు చేసిన సుదీర్ఘ పోరాటాల వల్ల 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చింది దీని ప్రకారం ప్రతి ఆదివాసి కుటుంబానికి 10 ఎకరాలకు హక్కులు కల్పించాలి కానీ ప్రాజెక్టులు పరిశ్రమలు ఓపెన్కాస్టులు వివిధ రకాల గనుల్లో రోడ్లవెంబడి తదితర పరికరాలకు వేల లక్షల ఎకరాల అడవులు విధ్వంసానికి అనుమతులు ఇస్తున్న ప్రభుత్వాలు తో తరాలుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్న పేదలపై దాడులు దౌర్జన్యాలు చేయడం అత్యంత దుర్మార్గం చివరకు గతంలో పట్టా పత్రాలు ఇచ్చి సాగు చేసుకుంటున్న భూములకు నుండి కూడా గెంటి వేయడానికి అనేక చోట్ల పూనుకోవడం అన్నిటికీ మించిన దుర్మార్గం అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అఖిల భారత రైతుకూలీ సంఘం తెలిపింది.

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ 2016 జూలై లెక్కల ప్రకారం 2.12 లక్షల మంది7.61 లక్షల ఎకరాలకు రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్నారు కానీ 45 శాతం మంది దరఖాస్తులు ఆమోదించారు మిగతా వారికి ఎందుకు తిరస్కరించారు చెప్పలేదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు 80,000 మంది దరఖాస్తు చేసుకోగా1.78 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చారు

ఆ తరువాత కూడా కొందరు దరఖాస్తు చేసుకున్నారు కానీ అటవీ హక్కుల చట్టాన్ని గౌరవించకుండా నిపుణుల సూచనలు సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఆదివాసీలను అన్యాక్రాంతనికి పాల్పడిన వారిని పేరు పెట్టి భయపెడుతున్నారని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అఖిల భారత రైతుకూలీ సంఘం ఆరోపించింది. ఆదివాసులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని కెసిఆర్ హామీ వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

పోడు భూముల పరిరక్షణ  పాదయాత్రలో పోటు రంగారావు  CPI (ML) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఇల్లందు  మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య,  AIKMSజాతీయ నాయకులు రాయల చంద్రశేఖర్, పార్టీ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు,  AIKMS జిల్లా కార్యదర్శి ఆవుల వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా నాయకులు K.అర్జునరావు, G.రామయ్య ,A.అశోక్, K.రవి ,శిరోమణి, మంగతాయి, శివలింగం,ఘంటా శ్రీను, ఆజాద్, వెంకటేష్,చందు, లాల్ మీయా, అప్పారావు, శరత్, రాజేంద్రప్రసాద్, ఝాన్సి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.  

Related posts

సైకో పాలన కారణంగా ఏపీలో పెరుగుతున్న‌ నిరక్షరాస్యత

Satyam NEWS

జాతీయ రహదారిపై తృటిలో తప్పిన పెను ప్రమాదం

Satyam NEWS

“ప్యారీ” తారావలి నిజజీవిత గాథ!!

Satyam NEWS

Leave a Comment