37.2 C
Hyderabad
May 2, 2024 13: 27 PM
Slider కరీంనగర్

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం

#kaleswaram

తెలంగాణ రాకముందు నీటి కోసం జిల్లాల మధ్య నీటి యుద్దాలు జరిగేవని, నేడు స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ సస్య శ్యమలం అయిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. లోయర్ మానేర్ జలాశయం నుండి కాకతీయ కాలువ ద్వారా దిగువకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి  మంత్రి గంగుల కమలాకర్ నీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు మనేరు నుండి దిగువకు 9 లక్షల ఎకరాల సాగుభూమి కోసం నీటిని విడుదల చేయడం జరిగిందని అన్నారు. రైతుల నుండి డిమాండ్ తక్కువగా ఉన్నందున కాకతీయ కాలువ ద్వారా ప్రస్తుతం 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందని, అవసరం అయితే పెంచుతామని అన్నారు. ఈ కాలువ ద్వారా నీరు వరంగల్ జిల్లా మీదుగా సూర్యాపేట వరకు వెళ్లనున్నయని తెలిపారు. తెలంగాణ రాక ముందు ఇదే మానేరు జలాశయం నుండి ఆనాటి కాంగ్రెస్ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా కు నీటిని తీసుకెళతానని చూస్తే మా జిల్లాకు ఇచ్చిన తర్వాతే నీటిని తీసుకెళ్లాలని ఆందోళన చేసి ఆపేసామని గుర్తు చేశారు.

తెలంగాణ రాక ముందు నేర్రలు బారిన నేలలతో గొంతులు ఎండి పోయిన పరిస్థితులు ఉండేవని, కానీ నేడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో 40 నుండి 50 టీఎంసీ ల నీటిని అందిస్తున్నామని అన్నారు. కాళేశ్వరం నీటితో చివరి ఆయకట్టు వరకు నీరు వెళ్లి పంటలు సమృద్ధిగా పండి దిగుబడి గణనీయంగా పెరిగిందనీ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడి ఎగువ మానేరుకు కూడా డిమాండ్ మేరకు నీటిని విడుదల చేస్తామని అన్నారు.

Related posts

వృద్ధురాలిని రోడ్డున పడేసిన కుమారులపై స్పందించిన మానవ హక్కుల కమిషన్

Satyam NEWS

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని కలిసిన ఐ ఏ ఎస్,ఐ ఆర్ ఎస్ బృందం

Satyam NEWS

కర్కశ పోలీసుల చేతుల్లో నలిగిపోయిన పిల్లాడు

Satyam NEWS

Leave a Comment