28.7 C
Hyderabad
April 28, 2024 05: 57 AM
Slider ఆధ్యాత్మికం

కోవిడ్ సమయంలో వెలవెల బోయిన ఆలయం నేడు భక్తులతో కళకళ

#mattapally

బిల బిల కృష్ణా నది పరవళ్ళతో ఉత్తర వాహిని గా,ప్రవహిస్తున్న పవిత్ర కృష్ణానదీ తీరాన ప్రకృతి సిద్ధమైన గుహలో స్వయం వ్యక్తమైన మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి ఆలయం కోవిడ్ విలయ తాండవ సమయంలో భక్తుల దర్శనం లేక వెలవెల బోయింది.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల మట్టపల్లి మహా క్షేత్రంలో కోవిడ్ నియమ నిబంధనల సడలింపుతో ఆలయాలు తెరవడంతో మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి ఆలయం భక్తులకు కోవిడ్ నియమ,నిబంధనలు పాటిస్తూ దర్శనం కల్పించడంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. చాలా రోజుల తరువాత స్వామి వారి దర్శనం కలగడంతో భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకున్నారు.

ధర్మకర్త కర్త చెన్నూరి విజయ కుమార్, అర్చకులు,ఆలయ సిబ్బంది, దగ్గరుండి కోవిడ్ నిబంధనలు పాటింప చేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Related posts

పండుగ వాతావరణంలో పాఠశాలలు ప్రారంభం

Satyam NEWS

అప్పుడు అడుగులకు మడుగులు… ఇప్పుడు మొహం చాటు

Satyam NEWS

కలకలం సృష్టిస్తున్న రష్యా పౌరుల అసహజ మరణాలు

Satyam NEWS

Leave a Comment