38.2 C
Hyderabad
April 27, 2024 16: 42 PM
Slider హైదరాబాద్

పలు రాష్ట్రాలకు ఐ సి డి ఎస్ ఉత్పత్తుల సరఫరా చేస్తాం

#mallareddy

తెలంగాణ ఫుడ్స్ ఉత్పత్తులను  పెంచి ఇతర రాష్ట్రాలతో సరఫరా చేయడానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ నాచారం డివిజన్ పరిధిలో  నాచారం పారిశ్రామిక వాడలోని రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మాణమైన తెలంగాణ ఫుడ్స్ ప్రాంగణం లో నూతన స్టోరేజ్ గోడౌన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధి గా హాజరయ్యారు. 

కార్మిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు చామకూర మల్లా రెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే  భేతీ సుభాష్ రెడ్డి, నాచారం కార్పొరేటర్ సాయి జెన్ శాంతి శేఖర్ తో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐ సి డి ఎస్  ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కేంద్రం నుంచి ఒత్తిడి పెరుగుతుంది అన్నారు. యూనిసెఫ్ ఇతర సంస్థల శాస్త్రీయ పద్ధతిలో ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 35,000 వేల ఉత్పత్తులను సరఫరా చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

వెనుకబడిన జిల్లాలను పౌష్టికాహారం అందించడానికి గర్భిణీలు, బాలింతలకు బాలామృతం అందిస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడి టీచర్లకు గత ఎనిమిది సంవత్సరాల్లో మూడు దఫాలుగా వేతనాలు పెంచి గౌరవిస్తున్నామని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 92 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తుందని, 11 వేల మంది ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు భద్రత కల్పిస్టే కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో  తెలంగాణ ఫుడ్స్ స్పెషల్ సెక్రెటరీ, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎస్సీ మేనేజింగ్ డైరెక్టర్  ఐఏఎస్ అధికారి దివ్య దేవ రంజన్,  జనరల్ మేనేజర్ విజయలక్ష్మి, హెచ్ ఆర్ డి మేనేజర్ కృష్ణవేణి, మేనేజర్లు శ్రీనివాస్ నాయక్ , ఎలమంద,   వెంకటయ్య , కార్పొరేటర్లు , స్వర్ణ రాజు,బొంతు శ్రీదేవి జెర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, బన్నల గీత ప్రవీణ్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు ,సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సుడుగు మహేందర్ రెడ్డి, కాసం మహిపాల్ రెడ్డి, పల్ల కిరణ్ కుమార్ రెడ్డి, మేకల ముత్యం రెడ్డి ,పల్లె నరసింగారావు డాక్టర్ బి వి చారి వేముల సంతోష్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు తెలంగాణ ఫుడ్స్ యజమాన్య కార్మిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల కు ఉద్వాసన?

Satyam NEWS

10 శాతం రిజ‌ర్వేష‌న్లపై హ‌ర్షాతిరేకాల వెల్లువ

Sub Editor

దేశాన్ని అమ్మే పనిలో మోడీ ప్రభుత్వం

Bhavani

Leave a Comment