38.2 C
Hyderabad
April 29, 2024 19: 35 PM
Slider ప్రత్యేకం

ఏపీలో జూనియర్ సివిల్‌ జడ్జిగా తెలంగాణ యువతి

#alekhya

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిర్వహించిన జూనియర్ సివిల్‌ జడ్జి పరీక్షల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. తెలంగాణ యువతి అలేఖ్య ఏపీ జూనియర్ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. పరీక్ష ఫలితాల్లో అలేఖ్య ఫస్ట్ ర్యాంకు సాధించి సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. హన్మకొండ కు చెందిన మాధవీలత, పరిమి మనోజ్‌ కుమార్‌ దంపతుల కుమార్తె అలేఖ్య హైదరాబాద్‌ పెండేకంటి కాలేజీలో 2022లో న్యాయశాస్త్ర విభాగంలో ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో సీనియర్ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న తల్లి మాధవీలతను స్ఫూర్తిగా తీసుకుని తానూ జడ్జి కావాలనుకున్నారు. ఆమెను రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దీకొండ రవీందర్‌, ప్రధాన కార్యదర్శి పట్టోళ్ల మాధవరెడ్డి అభినందించారు.

Related posts

ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఉచితంగా ఇవ్వాలి

Satyam NEWS

టీడీపీ అధినేత చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు

Bhavani

ప్రేమించి మోసపోయిన యువతి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment