Slider కృష్ణ

జగన్ రెడ్డి సర్కారుపై సర్పంచ్ ల మలిదశ పోరాటం

#yvbrajendraprasad

స్థానిక సంస్థలకు తీరని ద్రోహం చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం సమర శంఖం పూరించింది. న్యాయబద్ధమైన 16 డిమాండ్ల సాధన కోసం గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్న మహాత్మా గాంధీ వర్ధంతి రోజైన ఈ నెల 30వ తేదీ నుంచి మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. విజయవాడలోని బాలోత్సవ్ భవన్ లో ఏ.పీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్, ఏ.పీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావుల అధ్యక్షతన నేడు జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలోని 12,918 గ్రామాలలో  నివసిస్తున్న 3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజల న్యాయబద్ధమైన  సమస్యలని తీర్చాల్సిన అవసరం ఉందని రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. 16 డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలో జరిగే మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్ని సర్పంచులు, ఎంపీటీసీలు  రాష్ట్ర వ్యాప్తంగా బహిష్కరించాలని, అలాగే కౌన్సిలర్స్, కార్పొరేటర్స్  మున్సిపాలిటీ – కార్పొరేషన్ల సర్వసభ్య సమావేశాలను బహిష్కరించాలని రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. గ్రామ సభలు పెట్టి గ్రామీణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరించి  “గ్రామ వికాస పత్రాన్ని” రూపొందించాలని కూడా తీర్మానించారు.

అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు  “ఛలో అసెంబ్లీ”  కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు,ఎంపీటీసీలు,ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్స్,కార్పొరేటర్స్ రాజకీయాల కతీతంగా చేపట్టాలని కూడా నిర్ణయించారు. సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాలని, రాజకీయాలకతీతంగా ఐక్యమై ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలి

Bhavani

క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో సిబిఐటి విద్యార్ధులు

Satyam NEWS

తితిదే ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష

Bhavani

Leave a Comment