31.7 C
Hyderabad
May 2, 2024 09: 00 AM
Slider మెదక్

వంటనూనెల కొరతను అవకాశంగా మలచుకోండి

#harishrao

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పోతరెడ్డిపేట గ్రామంలో 50 మంది అర్హులైన రెండు పడకల గదుల లబ్ధిదారులతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గృహా ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు కూడా ఉన్నారు. అనంతరం పోతరెడ్డిపేట క్లస్టర్ రైతు వేదిక ప్రారంభించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పోతరెడ్డిపేట రైతువేదికలో మీడియాతో మంత్రి మాట్లాడారు.

మంత్రి హరీశ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

రైతులంతా ఆయిల్ ఫామ్ పెద్ద ఎత్తున సాగు చేయాలి.

ఉక్రెయిన్, రష్యా యుద్ధం తర్వాత వంటనూనె ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి.

ఈ మధ్యకాలంలో మలేషియా, ఇండోనేషియాలు ఆయిల్ ఫామ్ ఎగుమతి నిషేధించాయి. కారణం వంటనూనె ధరలు పెంపు, తమదేశ ప్రజలకే వంటనూనె అవసర రీత్యా ఆయా దేశాలు వంటనూనె ఎగుమతి నిషేధించాయి.

ఈ క్రమంలో భారతదేశంలో వంటనూనెలకు పెద్ద ఎత్తున కొరత ఏర్పడుతున్నది. దేశంలో ప్రతియేటా ఇతర దేశాల నుంచి లక్షకోట్ల ఫామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం.

ఇతర దేశాల నుంచి ఫామాయిల్ వస్తేనే మన దేశ ప్రజల వంటనూనె అవసరాలు తీరని పరిస్థితి నెలకొన్నదని, ఫామాయిల్, ఇతర సన్ ప్లవర్, ఇతర వంటనూనెలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.

ఓ వైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇండోనేషియా, మలేషియాలు ఎగుమతి నిలిపి వేసిన దృష్ట్యా పెద్ద ఎత్తున వంట నూనెలకు డిమాండ్ ఏర్పడనున్నది.

ఈ యేడు సన్ ప్లవర్ పెట్టిన రైతులకు మద్దత్తు ధర కంటే రూ.2 నుంచి రూ.3 వేలు రైతులకు లాభాలు చేకూరుతున్నది.

ఆయిల్ ఫామ్ రైతులకు అన్నీ ఖర్చులు పోనూ రూ.1 లక్షా 50 వేలు మిగులు ఉంటున్నది. ఆయిల్ ఫామ్ చాలా లాభసాటి పంట. ఆయిల్ ఫామ్ పంటలో చీడ పీడ బాధ లేదు. పందులు, కోతుల బెడద లేదు. గెల, కమ్మ కొట్టడమే.. పాడి బర్రె తరహాలోనే నెల నెలా డబ్బులు ఆర్జించొచ్చు. యేటా ఖర్చులు పోనూ లక్షా 50 వేలు మిగులు బాటు ఉన్నది.

తెలంగాణలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సత్తుపల్లి మొదటిది. రెండవది సిద్ధిపేట జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ ఫెడ్ తో ఏర్పాటు చేసుకున్నాం.

ఆయిల్ ఫామ్ సాగులో రైతులకు ధర రాదని, కొనుగోళ్లు జరగవనీ అనుమానం లేదు.

దేశానికి లక్ష కోట్ల దిగుబడి ఆయిల్ ఫామ్ చేసుకుంటున్నామని, ఈ దిగుబడి ఆగాలంటే.. పది లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు అయితే తప్ప.. ఈ దిగుబడి అవసరం పడకుండా ఉండదు.

దేశంలో 10 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేసే అవకాశం ఉన్నది. ఈ దరిమిలా సిద్ధిపేటలో ఆయిల్ ఫామ్ నర్సరీ పెట్టి, 20 వేల ఎకరాలకు సరిపడేలా తోటలు పెంపకం చేస్తున్నాం.

వచ్చే జూలై నెల నుంచి ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, సీఎం కేసీఆర్ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆయిల్ ఫామ్ రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వనున్నాం.

మొన్నటి బడ్జెట్లో ఆయిల్ ఫామ్ సాగుకై వెయ్యి కోట్లు ప్రవేశపెట్టినట్లు వెల్లడి. రైతులకు మొక్కలకు సబ్సిడీ, డ్రిప్ సబ్సిడీ, ఎరువుల, వివిధ రూపాలలో ఆయిల్ ఫామ్ ప్రోత్సహించడం కోసం, రైతులకు మేలు చేయడం కోసం బడ్జెట్లో వెయ్యి కోట్లు నిధులు కేటాయింపు.

ముందుకొచ్చిన రైతులకు మొదటి ప్రాధాన్యత. ఆయిల్ ఫామ్ సాగుతో సత్తుపల్లి ప్రాంత రైతుల దశదిశ మారిందన, అలాంటి అవకాశం దుబ్బాక, సిద్ధిపేట జిల్లా ప్రజలు అందిపుచ్చుకోవాలి

పచ్చిరొట్టె విత్తనాలు విరివిగా సాగు చేయాలి

జిల్లాలో ఈ యేడాది కనీసం 30 శాతం పొలాల్లో పచ్చిరొట్టె విత్తనాలు విరివిగా సాగేయ్యేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలు దృష్టి సారించాలని మంత్రి ఆదేశం

పిల్లి పెసర, జనుము, జీలుగు, పచ్చిరొట్టె ఎరువులు రైతులకు ఇప్పించేలా చొరవ చూపాలని, ఎరువుల వాడకం తక్కువై నత్రజని వచ్చి పంట దిగుబడి తగ్గుతుంది. భూసారం మెరుగు పడుతుందని, పచ్చిరొట్టె ఎరువులు ప్రతీ ఏఈఓ పరిధిలో 30 శాతం రైతులు వేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం సబ్సిడీ పై సరఫరా చేస్తున్నట్లు మంత్రి వెల్లడి.

జిల్లాలో నకిలీ విత్తనాలు బెడద లేకుండా చూడాలని, పత్తి సాగు, సెరి కల్చర్ ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బందికి మంత్రి హరీశ్ ఆదేశం.

Related posts

ములుగులో బిఆర్ఎస్, బిజెపి లకు బిగ్ షాక్

Satyam NEWS

అరెస్టుకు ముందు సంచలన వీడియో విడుదల చేసిన పట్టాభి

Satyam NEWS

అవాంఛనీయ వ్యాఖ్యలతో రెచ్చగొట్టే రాజకీయం

Satyam NEWS

Leave a Comment