29.7 C
Hyderabad
May 2, 2024 06: 34 AM
Slider కరీంనగర్

విద్యావైద్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట

#GangulaKamalakar

తెలంగాణ ప్రభుత్వం విద్యా… వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారని బిసి సంక్షేమం… పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పునరుద్ఘాటించారు. నేడు మంగళవారం కొత్తపల్లి విత్తన శుద్ధి కర్మగారం సమీపంలో రమేష్ రెడ్డి తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ మెడికల్ కళాశాల స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దానిలోని భాగంగానే కరీంనగర్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు..2023-2024 విద్యా సంవత్సరం తాత్కాలిక భవనాల్లో పాఠాలను

ప్రారంభిస్తామని వెల్లడించారు..మొదట 100 సీట్లతో పాఠాల బోధన ప్రారంభిచి త్వరితగతిన శాశ్వత భవనాలను నిర్మించి అందులోకి షిఫ్ట్ చేస్తమని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మించేందుకు కొత్తపల్లి విత్తన శుద్ధి కర్మాగారం సమీపంలో 25 ఎకరాల విశాలమైన స్థలం కేటాయించారని… తొలుత వందసీట్లతో కాలేజీని ప్రారంభించబోతున్నామని… ప్రస్తుతం క్లాసులను తాత్కాలిక రూమ్ లలో నిర్వహించి… మెడికల్ కాలేజీకి కావల్సిన 5 వందల పడకల ఆసుపత్రి ఇప్పటికే కరీంనగర్ లో అందుబాటులో ఉందన్నారు. .వైద్యానికి పెద్ద పీఠ వేయడమే ధ్యేయంగా సిఎం కెసిఆర్ ముందుకు సాగుతున్నారని… ఇందుకోసం జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారన్నారు.

అయితే కరీంనగర్ లో ఇప్పటికే రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉండడంతో… ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాదేమోనంటూ అనుమానపడ్డారని… వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ… సిఎం కెసిఆర్ కరీంనగర్ కు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేశారన్నారు. అందరి సహకారంతో త్వరితగతిన శాశ్వత భవనాన్ని నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో … డిఎంఈ రమేష్ రెడ్డి.. కలెక్టర్ ఆర్ వి కర్ణన్ కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఆసుపత్రిసూపరెండేంట్ రత్నమాల మాజీ ఎంపీపీ వాసాల రమేష్ జమీలుద్దీన్ ,తదితరులు పాల్గొన్నారు.

Related posts

రవిప్రకాశ్ కస్టడీపై న్యాయస్థానం నిర్ణయం రేపు

Satyam NEWS

సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలు

Murali Krishna

జమ్మి చెట్టు విజయానికి ప్రతీక : ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment