29.7 C
Hyderabad
April 29, 2024 10: 03 AM
Slider ఖమ్మం

సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలు

#ajay

పాఠశాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పథకం మన ఊరు-మన బడి అని అందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడం జరిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. మన బస్తి – మన బడి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరoలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 57.38 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరుతో పాటు వారు తమ పాఠశాల విద్యను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి ఉన్నత విద్యను ఉచితంగా అభ్యసించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో ఇంకా 16 ప్రభుత్వ పాఠశాలలో పనులు కొనసాగుతున్నాయని అతి త్వరలో వాటిని పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని హామి ఇచ్చారు.

దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనికోసమే మన ఊరు-మన బడి/మన బస్తి-మన బడి పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తోందన్నారు. దశల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునీకరణ,  స్కూళ్లలో 12 రకాల మౌలిక సదుపాయల కల్పనకు పటిష్ట చర్యలు చేపట్టామని, గ్రామీణ ప్రాంతాలలో ఈ స్కీమ్‌ను మన ఊరు-మన బడి పేరుతో అమలు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాలలో మన బస్తి-మన బడి పేరుతో అమలు చేస్తున్నామన్నారు.ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకే తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థ పై అత్యధికంగా నిధులు వెచ్చించిందన్నారు. తొలుత ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, ఆయా పాఠశాలలో నీటి సౌకర్యంతో పాటు టాయిలెట్లు, విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడే ఫర్నీచర్ అందించడం, పాఠశాలలు మొత్తం నవీకరించడం, మరమ్మత్తులు చేయడం, కిచెన్లు ఏర్పాటు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూ‌లు ఏర్పాటు చేయడం, డిజిటల్ విద్య వంటి వాటిని అమలు చేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్  గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, కార్పొరేటర్ పగడాల శ్రీవిద్యా నాగరాజ్, సుడా చైర్మన్ విజయ్, సోమశేఖర్ శర్మ, కృష్ణా తదితరులు ఉన్నారు.

Related posts

అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు

Satyam NEWS

ఈ నెల 28 వ తేదీ నుంచి ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్

Murali Krishna

ఉప్పల్ లో ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం

Satyam NEWS

Leave a Comment