35.2 C
Hyderabad
April 27, 2024 13: 26 PM
Slider తూర్పుగోదావరి

రైతులను బెదిరించి వసూళ్లు : 13 మంది విలేకరులపై కేసు

#CRIME

పొలాలు బాగు చేసుకుంటున్నా రైతులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 13 మంది పాత్రికేయులపై కేసు నమోదు చేసినట్లు అనపర్తి సిఐ విపత్తి శ్రీనివాస్ తెలిపారు ఆదివారం బిక్కవోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ పగలు ఎండ తీవ్రత వేడి గాలుల కారణంగా రాత్రి సమయంలో పొలాల్లోని ఎత్తు పల్లాలు సరిచేసుకుంటున్న రైతులను డబ్బులు ఇవ్వాలంటు డిమాండ్ చేయడమే కాకుండా వారిపై దౌర్జన్యం చేశారని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. సుమారు 15 మంది వచ్చారని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని తమ ట్రాక్టర్లు, జెసిబి తాళాలు దౌర్జన్యంగా లాక్కోవడంతో ఘర్షణ జరిగిందనీ దీనితో వారి వెంట తెచ్చుకున్న బటన్ స్టిక్కుల్తో దాడికి ప్రయత్నించగా గ్రామస్థుల సహకారంతో వారిని ఎదుర్కోవడం జరిగిందన్నారు. గత ఏడాదికాలంగా విలేకరుల ముసుగులో కొంతమంది వ్యక్తులు మండలంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ డబ్బులు ఇవ్వని వారిపై ఇనుప రాడ్లు చూపించి భౌతికదాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు.

కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన కర్రి రామకృష్ణారెడ్డి, మేడపాటి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, అమలాపురం జిల్లా రాయవరంకు చెందిన పాస్టర్ పలివెల ప్రసాద్, పందలపాకకు చెందిన రేపు సురేష్, బొమ్మ కంటి సుబ్బారావు, సొర్ల శ్రీనివాస్, పూలపల్లి కి చెందిన మద్దూరు వీరబాబు, కొమరిపాలెంకు చెందిన మల్లిడి వెంకట కృష్ణారెడ్డి, మెట్రో రాజశేఖర్ బలబద్రపురం గ్రామానికి చెందిన కొండేటి శ్రీమన్నారాయణ వ్యక్తులతో కలసి గత కొన్నేళ్లుగా మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఒక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి మండల వ్యాప్తంగా దందాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ ముఠా బిక్కవోలులోనే కాకుండా పెదపూడి, రంగంపేట, రాయవరం మండలాల్లోనూ తమ దందాలను విస్తృతపరిచి అక్రమార్కుల వద్ద నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు.

అమాయక రైతుల్ని, వ్యాపారస్తులకు లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడి డబ్బులు ఇవ్వని వారి పై పరుష పదాలతో దూషించడమే కాకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని దర్యాప్తులో తేలిందన్నారు. వీరి భాధితులేవరైన ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని వారికి తగిన భద్రత కల్పించి చర్యలు తీసుకుంటామని సి ఐ తెలిపారు కార్యక్రమంలో ఎస్సై పి. బుజ్జిబాబు ఉన్నారు.

Related posts

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

ఉయ్ ఆర్ రెడీ: లాక్ డౌన్ కు విశాఖపట్నం జిల్లా సన్నద్ధం

Satyam NEWS

శ్రీశైలం జల విద్యుత్ కేంద్ర ప్రమాదంపై సీబీఐ విచారణ జరపాలి

Satyam NEWS

Leave a Comment