33.7 C
Hyderabad
April 29, 2024 00: 19 AM
Slider మహబూబ్ నగర్

తెలంగాణ మాల మహానాడు నియామకాలు

#malamahanadu

తెలంగాణ మాల మహానాడు మహబూబ్ నగర్ రూరల్ మండల యువత కార్యదర్శి గా కాడం శేఖర్ ను నియమించారు. తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగింది. జిల్లా కార్యదర్శి కాడం రాఘవేందర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్య మహబూబ్ నగర్ రూరల్ మండలం జమిస్తాపూర్ గ్రామానికి చెందిన కాడం శేఖర్ ను మహబూబ్నగర్ రూరల్ మండల యువత కార్యదర్శి గా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య మాట్లాడుతూ దళితుల హక్కుల కోసం, అనగారిన వర్గాల అభివృద్ధి కోసం, జాతి ప్రయోజనాల కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం యువత ముందుండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ దేశానికి యువతనే వెన్నుముక అని అన్నారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరని తెలిపారు. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ  యువత ముందు వరుసలో ఉండి వారికి న్యాయం చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో గ్రామ గ్రామాన యువతను చైతన్యం చేసి వారిని భాగస్వాములను చేయాలని కోరారు. స్వార్థ ప్రయోజనాల కోసం అగ్రవర్ణ రాజకీయ పార్టీలు అన్నదమ్ముల్లాంటి మాల మాదిగలను విడదీయాలని చూస్తున్నాయని ఆ పార్టీలకు యువత ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు. గ్రామ గ్రామాన అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకుపోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు, జిల్లా కార్యదర్శి కాడం రాఘవేందర్, జిల్లా ఉపాధ్యక్షులు పాశం రాకేష్, పాలమూరి రాము,జిల్లా ప్రచార కార్యదర్శి ధర్పల్లి అంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి బ్యాగరి వెంకటేష్, పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్, మహబూబ్ నగర్ రూరల్ మండలం గౌరవ అధ్యక్షులు కాడం కథలయ్య తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్ సత్యం న్యూస్ నెట్ కొల్లాపూర్

Related posts

రామ‌తీర్ధం విగ్ర‌హ ఘ‌ట‌న కేసులో వెబ్ సైట్ న్యూస్ కు స్పంద‌న‌…!

Satyam NEWS

తాండూరు మార్కెట్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా

Satyam NEWS

తెలుగుదేశం నేత పంటలను ధ్వంసం చేసిన వైసీపీ నాయకులు

Satyam NEWS

Leave a Comment