26.7 C
Hyderabad
May 3, 2024 08: 04 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపీ పోలీసుల్ని పరుగులు పెట్టించిన తెలంగాణ వాసులు

amaravathi

తాడేపల్లిలోని ఓ నిర్మాన్యూష ప్రాంతంలో 11 కార్లు, ఖాళీ ప్రదేశంలో టెంట్లు వేసుకుని కొందరు ఉంటుండటంతో ఒక్క సారిగా స్థానికులు కంగారు పడ్డారు. రెండు రోజులుగా కార్లలో వచ్చి టెంట్లు వేసుకుని వారు ఉండటంతో పాటు ఆ ప్రాంతంలో సంచరించటంతో అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అసాంఘిక శక్తులు ఉన్నాయన్న అనుమానంతో సుమారు 50 మంది పోలీసులతో సిఐ మల్లిఖార్జునరావు అక్కడకు వచ్చారు. అందరిని చుట్టుముట్టి కార్లను, టెంట్లను తనిఖీలు చేశారు. అయితే ఆ కార్లలో బాంబులు, కత్తులు కాకుండా ఎల్.ఈ.డి. బల్బులు, జ్యోతిష్య సామగ్రి పుస్తకాలు, ఆయుర్వేద మందులు దొరికాయి. దాంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వారిని ప్రశ్నిచగా మేము సంచార బుడగు జంగాలమని జోతిష్యం చెప్పుకొని, హోల్ సేల్ కు బల్బులు, ఆయుర్వేద మందులు, అమ్ముకుని జీవిస్తామని తెలిపారు.

మొక్కు ఉన్నందున విజయవాడ కనక దుర్గమ్మని దర్శించుకునేందుకు ఈ ప్రాంతానికి వచ్చామని తెలిపారు. పోలీసులు అందరి వద్ద వివరాలు సేకరించారు. ఈ ప్రాంతం హైసెక్యూరిటీ జోన్ కావడంతో ఇక్కడ ఉండటానికి వీల్లేదని వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని హెచ్చరించారు.

Related posts

పుట్లూరు అమ్మన్ ఆలయాన్ని సందర్శించిన మంత్రి రోజా

Satyam NEWS

కోనసీమ వైసీపీలో ముసలం మంత్రి చెల్లుబోయినపై ఎంపీ బోస్‌ వర్గం తిరుగుబాటు

Bhavani

తిష్టవేసుకుని కదలని తిరుపతి రెవెన్యూ ఉద్యోగులు

Satyam NEWS

Leave a Comment