తెలంగాణ ఆర్టీసీ జెఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ద్విచక్రవాహన ప్రదర్శన చేపట్టిన నేతలు, కార్మికులను హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానభవన్ వద్ద అరెస్టు చేశారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ ర్యాలీని ప్రారంభించగా ఈ ప్రదర్శనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ వామపక్ష శ్రేణులు, ఆర్టీసీ కార్మికులు వాహనాలతో ముందుకు కదిలారు. మార్గమధ్యంలో అడ్డగించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. అశ్వత్థామరెడ్డి సహా వామపక్ష నేతలు, మహిళలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టయిన వారిలో ఆర్టీసీ జెఏసి కో కన్వీనర్ రాజిరెడ్డి, వెంకన్నలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరని వీడి, కార్మికులతో చర్చలు జరపాలని కోరారు. ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలను కోరారు. సమ్మె విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు
previous post