గ్రామీణ భారత దేశం తీవ్రమైన వత్తిడిలో ఉందని కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీకి, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వత్తిడిని ఎలా దూరం చేయాలో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పెరిగిపోతున్న మాంద్యాన్ని తగ్గించేందుకు, సమర్ధవంతమైన చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికను చదవాలని ఆయన సూచించారు. దేశానికి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ ఎంతో కీలకమైనదని గ్రామీణ ప్రాంతాలలో ఆర్ధిక స్తబ్దత దేశాన్ని దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నెలకొని ఉన్న ఆర్ధిక మాంద్యాన్ని ఏ విధంగా తగ్గించాలి, పరిస్థితిని ఏ విధంగా మెరుగు పరచాలి అనే అంశాలను తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నామని ఆయన గుర్తు చేశారు.
previous post